సంక్రాంతి పండుగకు విడుదలైన సినిమాలలో నంబర్1 మూవీ ఏదనే ప్రశ్నకు ఎలాంటి సందేహం అవసరం లేకుండా హనుమాన్ అనే సమాధానం వినిపిస్తోంది.నా సామిరంగ మూవీ( na Samiranga movie ) కూడా పాజిటివ్ టాక్ తో ప్రదర్శితమవుతున్నా హనుమాన్ సినిమాను( Hanuman movie ) ఈ సినిమా బీట్ చేసే ఛాన్స్ లేదు.
ఎంత తొక్కినా కంటెంట్ ఉన్నోడిని ఎవ్వరూ ఆపలేరంటూ హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ( Director Prashant Verma )మరోమారు ప్రూవ్ చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తేజ సజ్జా( Teja Sajja ) ప్రశాంత్ వర్మకు స్నేహితుడు కాగా ఈ స్నేహ బంధం దాదాపుగా పది సంవత్సరాల నుంచి కొనసాగుతోంది.
ప్రశాంత్ వర్మ గతంలో ఎన్నో సినిమాలు తెరకెక్కించినా హనుమాన్ సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది.హనుమాన్ టీజర్, ట్రైలర్ లాంఛ్ కు కూడా ఎవరూ రాలేదని ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సూపర్ హీరో పాత్రలన్నీ పురాణాల నుంచి స్పూర్తి పొందినవని ప్రశాంత్ వర్మ చెబుతున్నారు.
నార్త్ లో సైతం కళ్లు చెదిరే స్థాయిలో ఈ సినిమాకు బుకింగ్స్ జరుగుతున్నాయి.నార్త్ లో సైతం ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.ప్రశాంత్ వర్మ బాలయ్యను సైతం సూపర్ హీరోగా చూపించనున్నారని తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ భవిష్యత్తు సినిమాలతో సైతం ఇదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సినిమా సక్సెస్ తో ప్రశాంత్ వర్మ రేంజ్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది.ప్రశాంత్ వర్మకు ప్రముఖ నిర్మాతల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.జై హనుమాన్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తే బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
జై హనుమాన్ మూవీ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోందని తెలుస్తోంది.వచ్చే ఏడాది జై హనుమాన్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.