తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ మూవీ( Game changer movie ) నుండి జరగండి.అనే లిరికల్ వీడియోని విడుదల చేసిన విషయం తెలిసిందే.
కలర్ ఫుల్ సెట్ లో కోట్లు ఖర్చు చేసి భారీగా ఈ సాంగ్ తెరకెక్కించినట్లు మనకు సాంగ్ చూస్తేనే అర్థం అవుతోంది.శంకర్ మార్క్ సాంగ్ నిర్మాణ విలువలు కనిపించాయి.
అనంత్ శ్రీరామ్ ( Ananth Sriram )సాహిత్యం అందించగా, ప్రభుదేవా కొరియోగ్రఫీ సమకూర్చారు.థమన్( Thaman ) మ్యూజిక్ మాత్రం శంకర్ స్థాయిని అందుకోలేదు.
ఏదో నాలుగైదు పాటల ట్యూన్స్ మిక్స్ చేసి ఆడియన్స్ మొహాన వేశాడు.శంకర్ మూవీకి ఒకప్పుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
వీరిద్దరి కాంబోలో వచ్చిన సాంగ్స్ నభూతో నభవిష్యతి.శంకర్ మేకింగ్ ని రెహమాన్ ట్యూన్స్ మరింత ఎలివేట్ చేసేవి.సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం ఆవిష్కృతం అయ్యేది.శంకర్ సినిమాల్లో సాంగ్స్ విజువల్ వండర్స్ లా ఉంటాయి.థమన్ ట్యూన్స్ తో శంకర్ తన మ్యాజిక్ కోల్పోయాడు.మరో దారుణమైన విషయం ఏమిటంటే.
ఇది కూడా కాపీ సాంగ్ అంటూ నెటిజెన్స్ ట్రోల్స్ షురూ చేశారు.జరగండి.
సాంగ్ ప్రారంభం శక్తి సినిమాలోని ఒక సాంగ్ ని గుర్తు చేసింది.ఆ ట్యూన్ కి దగ్గరగా ఉంది.
ఎన్టీఆర్-ఇలియానా నటించిన శక్తి చిత్రంలో సుర్రా సర్రన్నాదే అనే సాంగ్ ఉంది.ఈ సాంగ్ ని మణిశర్మ ట్యూన్ చేశారు.
జరగండి సాంగ్ ఈ సుర్రా సర్రన్నాదే సాంగ్( Surra Sarrannade song ) ని గుర్తు చేస్తుంది.
ఎక్కడో విన్నట్టుందని సెర్చ్ చేసిన నెటిజెన్స్.జరగండి శక్తి సినిమాలో సాంగ్ కి కాపీ అంటూ థమన్ ని ఏకిపారేస్తున్నారు.థమన్ లెక్కకు మించి కాపీ ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
ఈ మధ్య కాలంలో తలెత్తిన వివాదాలు పరిశీలిస్తే.వీరసింహారెడ్డి చిత్రంలోని జై బాలయ్య సాంగ్ ఒసేయ్ రాములమ్మ చిత్రంలోని టైటిల్ సాంగ్ కి కాపీ అన్నారు.
ఒక పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి ఫస్ట్ ప్రోమో విడుదల కాగా.యూట్యూబ్ నుండి బీజీఎమ్ మొత్తంగా లేపేసి ఓజీ చిత్ర ప్రోమోకి వాడాడు.
కాపీ ఆరోపణల మీద ప్రశ్నలు వేస్తే థమన్ తేలిగ్గా నవ్వేసి ఊరుకుంటాడు.అల వైకుంఠపురంలో చిత్ర సాంగ్స్ బ్లాక్ బస్టర్ కావడంతో థమన్ వెనుకబడ్డారు స్టార్స్ అందరూ.
ఆయనేమో ఇలా నాసిరకం మ్యూజిక్ ఇస్తున్నాడు.మరి ఈ ట్రోల్స్ పై థమన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.