ఇప్పుడు వచ్చే సినిమాలకు ఏదైనా చిన్న పొరపాటు జరిగినా లేదా ఏదైనా మతాన్ని కానీ దేవుని కానీ కించపరిచే విధంగా ఒక్క డైలాగ్ వచ్చిన ఊరుకునే రోజులు కాదు కేవలం బాడీ షేవింగ్ బోల్డ్ కంటెంట్ తో నడిచే షోలలో కూడా ఆడవారిని ఏదైనా అంటే ఉద్యమాలు లేవనెత్తుతున్నారు.సోషల్ మీడియా బాగా విజృంభించిన ఈ సమయంలో ఏ చిత్రంలోను ఏ షోలోనో అవసరానికి మించి లేదా అనవసరమైన ఎలాంటి డైలాగ్స్ ఉన్నా కూడా జనాలు యాక్సెప్ట్ చేయడం లేదు ఇప్పుడైతే ఈ పరిస్థితి ఉంది కానీ కొన్ని నేల వెనక్కి వెళితే చాలా పెద్ద పెద్ద విషయాలు అలవోకగా జరిగేవి.ఉదాహరణకు ఎన్టీఆర్( NTR ) నటించిన తన 200 వ మూవీ గురించి ఆ సినిమాలో ఉన్న అనేక విషయాల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
ఎన్టీఆర్ స్వయంగా తానే కథ రాసుకుని స్క్రీన్ ప్లే కూడా సమకూర్చుకొని కేవలం డి యోగానంద్ తో దర్శకత్వం చేయించిన సినిమా కోడలు దిద్దిన కాపురం.( Kodalu Diddina Kapuram ) ఈ సినిమాలో సావిత్రి జగ్గయ్య వాణిశ్రీ వంటి మహనీయులు నటించారు.అయితే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన విషయం విమర్శల పాలయింది ఒక నకిలీ బాబా ను నమ్మే ముడ భక్తురాలు పాత్రలో సూర్యకాంతం( Suryakantham ) నటించగా ఒక బాబా పాత్రకు నకిలీ బాబా అంటూ సృష్టించడం చాలా పెద్ద విమర్శలకు దారి తీసింది.కానీ ఇప్పుడు రోజుల్లో అయితే దీనివల్ల సినిమా కూడా ఆగిపోయే పరిస్థితి ఉండేది.
ఉద్యమాలు కూడా లేవనెత్తే వారు.అప్పుడు కాబట్టి అలా నడిచిపోయింది.
ఇక పేరుకే సినిమాలో వాణిశ్రీ( Vanisri ) హీరోయిన్ కానీ మొత్తం కథ సావిత్రి( Savitri ) తోనే ముడిపడి ఉంటుంది.
ఎన్ని విమర్శలు పాలైనా కూడా ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం దక్కించుకోవడం తో పాటు ఉత్తమ హీరోగా ఎన్టీఆర్ కి, మిగతా నటినటులకు కూడా బాగానే నంది అవార్డులు దక్కాయి.అప్పుడు ఎన్టీఆర్ చరిష్మా అలాంటిది.ఆయన నంది అంటే నంది లేదంటే పంది.
దూకిందే గంగ అన్నట్టుగా ఏది చెప్పినా నడిచింది కాబట్టి ఆ రోజుల్లో ఇలా కాంట్రవర్షియల్ సినిమా కూడా మంచి విజయాలు దక్కించుకొని అవార్డుల పంట పండించింది.అదే ఇప్పుడైతే కనక సినిమా అని రెండు రోజుల వరకు కూడా థియేటర్లో నడవనిచ్చేవారు కాదు.