మిస్టర్ మూవీ రివ్యూ

చిత్రం : మిస్టర్

 Mister Movie Review-TeluguStop.com

బ్యానర్ : శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్, లియో ప్రొడక్షన్స్

దర్శకత్వం : శ్రీను వైట్ల

నిర్మాతలు : నల్లమలుపు బుజ్జి, ఠాగుర్ మధు

సంగీతం : మిక్కి జే మేయర్

విడుదల తేది : ఏప్రిల్ 14, 2017

నటీనటులు – వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబా పటేల్, మురళీశర్మ, నాజర్ తదితరులు

వరుస డిజాస్టర్లతో కుదేలై కూర్చున్నారు దర్శకుడు శ్రీనువైట్ల.ఆగడు, బ్రూస్ లీ ఫలితాలు అయన్ని అగ్రహీరోలకి దూరం చేసాయి.

దాంతో ఓ హిట్ సినిమాతో మళ్ళీ తనని తాను నిరూపించుకునేందుకు వరుణ్ తేజ్ తో “మిస్టర్” అనే సినిమాతో మనముందుకు వచ్చారు.ఇన్నిరోజులు బకరా కామెడితో అవస్థలు పడ్డ వైట్ల, బకరా కామెడీలోంచి బకరా తీసేసి, కామెడి వదలకుండా మిస్టర్ తీసారు.మరి మిస్టర్ లో కామెడీ క్లిక్ అయ్యిందో లేదో రివ్యూలో చూడండి.

కథలోకి వెళితే :

చైయ్ (వరుణ్ తేజ్), తాతయ్య పిచ్చయ్యనాయుడు (నాజర్) ని అసహ్యించుకుంటూ సొంతూరికి దూరంగా స్పేయిన్ లో పెరుగుతాడు.చైయ్ కి ఓ తప్పిదం వలన పరిచయం అవుతుంది మీరా (హెబా పటేల్).చైయ్ మీరాతో ప్రేమలో పడతాడు.కాని మీరా సిద్ధార్థ్ అనే మరో అబ్బాయతో ప్రేమలో ఉంటుంది.తాతయ మీద కోపంతో ఇండియా వెళ్ళడానికి ఇష్టపడని చైయ్, మీరా ప్రేమ ప్రమాదంలో పడితే, ఆ సమస్య తీర్చడానికి ఇండియా వస్తాడు.

ఇక్కడ తనకి చంద్రముఖి (లావణ్య త్రిపాఠి) పరిచయం అవుతుంది.అసలే మీరా ప్రేమను సఫలం చేసేందుకు పోరాటం చేస్తూ శతృవులని సంపాదించుకున్న చైయ్, చంద్రముఖితో పరిచయం వలన రజావర వంశ రాజుకి చిక్కి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు.ఆ ప్రమాదం ఏమిటి ? అసలు చంద్రముఖి ఎవరు? చైయ్ మీరా, చంద్రముఖిలో ఎవరికి సొంతం అవుతాడు? తాతయ్య మీద ద్వేషం ఎందుకు పెంచుకున్నాడు? చివరకి తాత మనవలు ఒకటయ్యారా లేదా? ఈ విషయాన్ని తెరమీదే చూడాలి.

నటీనటులు నటన :

పచ్చిగా చెప్పాలంటే, వరుణ్ తేజ్ డ్యాన్సులు, కామెడీ చేయాలని, కమర్షియల్ హీరోగా నిలబడాలని ఈ సినిమా చేసుంటాడు.టార్గేట్ ప్రకారం వరుణ్ కామెడీ టైమింగ్ తో కొన్ని నవ్వులు పూయించాడు.రేపు ఏదైనా హాస్యరసం బాగా ఉన్న సినిమా చేయాల్సవస్తే వరుణ్ భయపడాల్సిన అవసరం లేదు.

డ్యాన్సుల్లో తేలిపోయాడు.కంచె లాంటి సినిమాతో మంచి నటుడు అనిపించుకున్న వరుణ్ ఈ సినిమాలో పెద్దగా చేయగలిగింది ఏమి లేదు.

హెబా ఎప్పటిలానే అదే రోటీన్ చలాకితనాన్ని చూపించింది.సెకండాఫ్ లో తన పాత్ర తీరుతెన్నులు మారినా, మాట్లాడడానికి ఏమి లేదు.

లావణ్య కి కూడా ప్రతిభ చూపించడానికి పెద్దగా ఆస్కారం ఉన్న పాత్ర దొరకలేదు.ఓ పాటలో మాత్రం గ్లామర్ ఒలకబోసే ఛాన్స్ దొరికింది.

నాజర్ పాత్ర అంతంతమాత్రమే.విలన్ పెద్ద మైనస్

కామెడియన్స్ లో శ్రీనివాస్ రెడ్డి, రఘబాబు మాత్రమే నవ్వించగలిగారు.

పెళ్ళిచూపులు ప్రయదర్శి టాలెంట్ ని వాడుకోలేకపోయారు.చివరికి పృథ్వీని కూడా వాడుకోలేకపోయారు.

టెక్నికల్ టీమ్ :

మిక్కి జే మేయర్ పాటలు ఫర్వాలేదు.కాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగాలేదు.

హీరో కోసం వాడిన సిగ్నేచర్ బిట్ దారుణంగా ఉంది.కెమరా పనితనం అక్కడక్కడ బాగుంది, అక్కడక్కడ లో బడ్జెట్ సినిమాల ఉంది.

రజావర రాజుల ఎపిసోడ్ లో వాడిన గ్రాఫిక్స్ అమీర్ పేటలో కోచింగ్ కి వెళ్ళేవారు చేసినట్టు ఉంది.ఎడిటింగ్ కూడా సినిమాను దెబ్బతీసింది.

ఒకటిరెండు చోట్ల షార్ట్ ఫిలిం జర్కులు కనిపించాయి.ఇన్ని తప్పులున్నా, నిర్మాతలు మాత్రం బాగానే ఖర్చుపెట్టారు.

కాని సరిగా ఖర్చుపెట్టలేదు.గోపిమోహన్, శ్రీనువైట్ల రచన చాలా ఓల్డ్ మోడల్.

అరిగిపోయిన కథనం ఇది

విశ్లేషణ :

ఫోర్స్డ్ అండ్ సడెన్ రియాక్షన్స్.శ్రీనువైట్ల స్టోరి టెలింగ్ లో కనిపించే అతిపెద్ద తప్పు ఇదే.ప్రతి రియాక్షన్ ఇరికించినట్టుగానే ఉంటుంది.కథనం ఎప్పుడూ గజిబిజిగా ఉంటుంది.

అయితే ప్రేక్షకులు అర్థంచేసుకోలేకపోలేని గజిబిజి కాదు ఇది, ఇదేంట్రా బాబు అని నవ్వుకునే గజిబిజి.ఎక్కడపడితే అక్కడ ఎలాంటి సీన్ రాసుకుంటే అలాంటి సీన్ వచ్చేస్తుంది.

కేవలం కామెడి కోసం తీసుకొచ్చిన పాత్రలు విసుగు తెప్పిస్తాయి.ఫస్టాఫ్ లో శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు కామెడి ఫర్వాలేదు.

విపరీతంగా నవ్వకపోయినా, నవ్వొస్తుంది.వారి మూలానే ఫస్టాఫ్ ఫర్వాలేన్నట్టుగా వెళ్లిపోతుంది.

కాని సెకండాఫ్ లో ఒక్కటంటే ఒక్క కామెడి సీన్ పేలలేదు.మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ రిఫరెన్సులు కూడా పేలలేదు.

సీట్లలో కూర్చున్న ప్రేక్షకులు కామెడియన్స్ చూసి నవ్వట్లేదు, బయటకి వెళ్ళలేక, తెర మీద జరుగుతున్నది చూడలేక నవ్వుతున్నారు.శ్రీనువైట్లలో కామెడీ టచ్ ఇంకా అయిపోకపోవచ్చు, కాని ఈమధ్యకాలంలో అసలు కామెడి బయటకే రావట్లేదు.

ఇన్నేళ్ళు కథలో బలం లేకపోయినా, కాసేపు నవ్వుకోవచ్చు అని వైట్ల సినిమాలు చూసాం .కాని ఇప్పుడు కథతో పాటు కామెడీ కూడా ఉండట్లేదు.కాని కామెడీ ఉండకూడని సీన్లకి జనాలు నవ్వారు.చైయ్ తాత మీద కోపం ఎందుకు పెంచుకున్నాడో తెలిసే సీన్లో ఆడియెన్స్ నవ్వుతన్నారంటే అర్థం చేసుకోండి .సీరియస్ గా ఉండాల్సిన సీన్లలో మాత్రమే కామెడి పుట్టిందని.
కథలో ఏముందని కథ ఇలా ఉండకూడదు, ఇలా ఉండాల్సింది అని వాదిస్తాం! కథ లేక, కామెడి లేక, కేవలం వరుణ్ తేజ్ లో కామెడి టైమింగ్ ఉందని కొన్ని సీన్లు చూడటానికే ఈ మిస్టర్.

ప్లస్ పాయింట్స్ :

* శ్రీనివాస్ రెడ్డి, వరుణ్ తేజ్ ఫస్టాఫ్ కామెడీ

* ఫర్వాలేదనిపించే పాటలు

మైనస్ పాయింట్స్ :

* బలహీనమైన కథ, కథనాలు

* మిగితా కామెడీ సీన్లు అస్సల పేలకపోవడం

* అనవసరమైన పాత్రలు

* పూర్తి సెకండాఫ్

చివరగా :

ఈసారి బకరా కామెడి లేదు .కాని ప్రేక్షకులు బకరా అయ్యారు

తెలుగుస్టాప్ రేటింగ్ : 2/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube