బాహుబలి 2 మరో రెండువారాల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది.కాని ఏయే భాషల ప్రేక్షకుల ముందుకి మాత్రమే వెళుతుందో అనే విషయమే రాజమౌళితో సహా ఎవరికి అర్థం కావడం లేదు.
తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కన్ఫర్మ్ కాగా, తమిళ భాషలో, కర్ణాటక రాష్ట్రంలో బాహుబలి విడుదల మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కన్నడ రాష్ట్రంలో ఇష్యూ ఏంటో మీకు తెలిసిన విషయమే.
తమిళనాడు – కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉన్న కావేరి నదీజలాల గొడవల మీద సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు కన్నడ ప్రజలని ఇబ్బంది పెట్టాయట.కర్ణాటక రాష్ట్రంపై, కన్నడ ప్రజలపై సత్యరాజ్ చేసిన కామెంట్స్ అనుచితం అని, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోని, క్షమాపణలు చెబితే తప్ప బాహుబలి రెండొవభాగాన్ని కర్ణాటకలో విడుదల కానిచ్చేది లేదని 2000 కన్నడ సంఘాలు పట్టుమీద ఉన్నాయి.
ఈ విషయం మీద జక్కన్న స్పందిస్తూ “సత్యరాజ్ గారు చాలా సున్నితమైన మనిషి.ఎప్పుడు గట్టిగా మాట్లాడగా కూడా వినలేదు.
అలాంటి ప్రవర్తన ఉన్న మనిషి అంత హార్ష్ గా మాట్లాడి ఉంటారని నేను అనుకోలేదు.కాని వీడియో చూసాను, ఆయన చాలా ఆవేశంగా మాట్లాడారు.
కాని తమిళ్, కన్నడ నాకు పూర్తిగా అర్థం కావు.ఏం అన్నారో కాని కోపంగానే అన్నారు.
తప్పు మాట్లాడుంటే అది మంచి విషయం కాదు కాని ఇదంతా జరిగి తొమ్మిదేళ్ళు గడిచాయి.ఈ తొమ్మిదేళ్ళలో సత్యరాజ్ గారి సినిమాలు ఓ పాతిక దాకా కర్ణాటకలో విడుదల అయింటాయి.
అంతెందుకు, బాహుబలి 1 కూడా విడుదల అయ్యింది.మరి ఇప్పుడు బాహుబలి 2 విడుదల సమయంలో సడెన్ గా సత్యరాజ్ కామెంట్స్ ఎందుకు గుర్తుకువచ్చాయో, ఇది నిజంగా అన్యాయం” అంటూ నేషనల్ మీడియాతో అన్నారు రాజమౌళి.
ఇక తమిళనాడులో డిస్ట్రిబ్యూటర్ కి ఏవో ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయట.అవి తీరేదాకా విడుదల ఆపేస్తాం అని ఫైనాన్షియర్లు కోర్టుకి ఎక్కేలా ఉన్నారు.
ఈ సమస్య అంత పెద్దది కాదు.డబ్బు సమస్య కాబట బాహుబలి నిర్మాతలు చూసుకుంటారు.
కాని కర్ణాటక సమస్య రాజమౌళిని కలవరపెడుతోంది.







