శ్రీరామ జన్మభూమి అయోధ్య( Ayodhya )లో అద్భుత దృశ్యం ఆవిష్కృతం అయింది.బాలరాముడికి సూర్య భగవానుడు సూర్యతిలకం దిద్దారు.
కాగా సూర్య కిరణాలు బాలరాముడి నుదుటిపై పడే విధంగా ఆలయ నిర్మాణం జరిగిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సూర్య కిరణాలు సుమారు 4 నిమిషాల పాటు బాలరాముడి( Balaram ) నుదుటన తిలకంగా ప్రసరించాయి.
ఈ సూర్య కిరణాల తిలకం సుమారు 58 మిల్లీ మీటర్ల పరిమాణంతో ఉందని తెలుస్తోంది.అయోధ్యలో తొలిసారి శ్రీరామనవమి వేడుకలు జరుగుతుండగా.ఈ అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది.అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకున్నారు.