తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు.60 ఏండ్లు దాటినా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా నటిస్తున్నాడు.ఆయన కొడుకు సినిమాల్లోకి వచ్చి ఆడిపాడుతున్నా.ఆయన కంటే చిరంజీవియే మంచి జోష్ తో ముందుకెళ్తున్నాడు.ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.మెగాస్టార్ గా ఎదిగాడు చిరంజీవి.
నిర్మాతలు, దర్శకులు ఆయనతో సినిమాలు తీసేందుకు ఎంతో ఎదురు చూస్తుంటారు.నాటి ప్రాణం ఖరీదు సినిమా నుంచి నేటి సైరా నర్సింహారెడ్డి వరకు చిరంజీవి నటించిన ఎన్నో సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టాయి.
కలెక్షన్ల పరంగా రికార్డులు షేక్ చేశాయి.ఇంతకీ ఆయన నటించిన సినిమాల్లో ఎక్కువ వసూళ్లు సాధించిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
*సైరా నర్సింహరెడ్డి
పోరాట యోధుడు ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.2019లో వచ్చిన ఈ సినిమా పెట్టిన పెట్టుబడి కంటే వచ్చిన రాబడి తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు.
*ఖైదీ నెంబర్ 150
రాజకీయాల నుంచి మళ్లీ సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి.ఈ సినిమాను చేశాడు.రైతు సమస్యలను కేంద్రంగా చేసుకుని ఈ సినిమా తీశాడు.ఈ సినిమా 104 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
*శంకర్ దాదా ఎంబీబీఎస్
బాలీవుడ్ లో సంజయ్ దత్ నటించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాను తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ పేరుతో రీమేక్ చేశాడు చిరంజీవి.2004లో వచ్చిన ఈ సినిమా 26 కోట్ల రూపాయలను సాధించిదిం.
*ఇంద్ర
ఫ్యాక్షన్ బ్యాగ్రాఫ్ లో తెరకెక్కన ఈ సినిమా 2002లో సూపర్ డూపర్ హిట్ కొట్టింది.ఈ సినిమా అప్పట్లోనే రూ.27 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.
*శంకర్ దాదా జిందాబాద్
శంకర్ దాదా ఎంబీబీఎస్ సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది.ఈ సినిమా రూ.26 కోట్ల రూపాయలను రాబట్టింది.
*స్టాలిన్
ఈ సినిమాలో చిరంజీవి ఆర్టీ అధికారిగా కనిపిస్తాడు.ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.సుమారు 23 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
*ఠాగూర్
ప్రభుత్ వ్యవస్థల్లో పెరిగిన అవినీతిని ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపించింది.చిరంజీవి కెరీర్ లో ఈ సినిమా బెస్ట్.2003లో ఈ సినిమ భారీ కలెక్షన్లు సాధించింది.
*జై చిరంజీవ
ఈ సినిమా 2005లో విడుదల అయ్యింది.యావరేజ్ గా ఆడిన ఈ సినిమా రూ.12 కోట్లు వసూలు చేసింది.