చైతన్య మాస్టర్ నాకు డాన్స్ నేర్పించారు... చైతన్య మరణం పై రంగస్థలం మహేష్ కామెంట్స్!

గత రెండు రోజుల క్రితం కొరియోగ్రాఫర్ చైతన్య ( Chaitanya ) ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా తనకు అప్పులు ఎక్కువగా అయ్యాయని ఈ అప్పులు తీర్చే స్టామినా తనకు ఉన్న ఇచ్చిన వారి ఒత్తిడి తాను భరించలేకపోతున్నానని అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అంటూ ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన సూసైడ్ గురించి చెబుతూ… నెల్లూరు క్లబ్ హోటల్లో సూసైడ్ చేసుకున్నారు.

 Master Chaitanya Taught Me To Dance Rangasthalam Mahesh Comments On Chaitanyas D-TeluguStop.com

అయితే చైతన్య మరణం పై ఎంతో మంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోని తాజాగా నటుడు రంగస్థలం మహేష్ ( Mahesh )కూడా చైతన్య మరణం పై స్పందించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మహేష్ కొరియోగ్రాఫర్ చైతన్య గురించి మాట్లాడుతూ ఆయన చాలా సరదాగా ఉంటారని తెలిపారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ( Sridevi Drama Company ) కోసం చైతన్యతో కలిసి తాను కూడా ట్రావెల్ అయ్యానని తనకు డాన్స్ కూడా నేర్పించారని మహేష్ తెలిపారు.మహేష్ వంటి వారే ఇలా ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే మిగతా వారి పరిస్థితి ఎలా అని ప్రశ్నించారు.ఇలా అప్పులు బాధలు తట్టుకోలేక ఈయన సూసైడ్ చేసుకున్నారు అంటే ఆ సమయంలో ఎంత ఇబ్బంది పడి ఉంటారో.

ఈ విషయం తెలిస్తే తాను కూడా ఎంతో బాధపడ్డాను అని మహేష్ తెలిపారు.

ఈ విధంగా చైతన్య మరణం గురించి మహేష్ స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక సినిమా ఇండస్ట్రీలో వచ్చే రెమ్యూనరేషన్ల గురించి మాట్లాడుతూ కెరియర్ మొదట్లో మనకు అవకాశాలు రావాలి అంటే వారు ఇచ్చిన మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకోవాలని ఎప్పుడైతే మనకు సక్సెస్ అవుతుందో ఆ సమయంలో మనం రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన అర్థం ఉంటుందని తెలిపారు.ఇలా ఒకప్పుడు బుల్లితెరపై తన కామెడీతో అందరినీ ఆకట్టుకున్నటువంటి కమెడియన్ మహేష్ అనంతరం సినిమా అవకాశాలను అందుకొని వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube