మెటాకు భారీ స్థాయిలో జరిమానా... కారణం ఇదే?

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్ బుక్‌( Facebook ) మాతృసంస్థ మెటాకు గట్టిగానే దెబ్బ పడింది.అవును, మెటాకు రికార్డు స్థాయిలో జరిమానా విధించింది యూరోపియన్ యూనియన్.యూరప్ ( Europe )యూజర్ డేటాను యూఎస్‌కు బదిలీ చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ‘మెటా’కు రికార్డు స్థాయిలో అంటే 1.3 బిలియన్‌ యూరోలు జరిమానా విధించింది.అదే విధంగా అట్లాంటిక్ అంతటా వినియోగదారు డేటాను బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని కూడా ఆదేశించడం గమనార్హం.ఈ మేరకు యూరోపియన్ యూనియన్ మే 22న ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 Massive Fine For Meta... Is This The Reason, Massive Fine , Latest News, Techno-TeluguStop.com

మెటాకు ఇది పెద్ద దెబ్బే అని చెప్పుకోవాలి.2018 మే 25వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ని మెటా ఉల్లంఘించిందని ఐరిష్ వాచ్‌డాగ్ ఆరోపించింది.ఈ నేపథ్యంలో 1.3 బిలియన్ యూరోలు అంటే దాదాపు 130 కోట్ల డాలర్లు లేదా 10 వేల కోట్ల రూపాయలు చెల్లించాలని డీపీసీ ఆదేశించింది.ఈ వ్యవహారంపై మెటా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం కొసమెరుపు.ఈ నేపథ్యంలో అన్యాయమైన ఈ జరిమానాపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది మెటా.

కాగా, డేటా గోప్యతపై యూరప్ యొక్క కఠినమైన నిర్ణయాన్ని నెటిజనం ఆహ్వానిస్తున్నారు.ఒక్క మెటా మాత్రమే కాకుండా వివిధ సోషల్ మీడియా( Social media ) కంపెనీలు యూజర్ల డేటాను తమ ఇష్టం వచ్చినట్టు అపరిచితులు అమ్మి వేస్తున్నారని అంటున్నారు.ఈ నిర్ణయంతో ఆయా కంపెనీలకు గుబులు పుడుతుందని అభిప్రాయపడుతున్నారు.మరికొంతమంది అయితే దిగ్గజ సోషల్ మీడియా యాప్ ఫేస్ బుక్ ని శాశ్వతంగా బ్యాన్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube