అంతరిక్షంలో పెళ్లేమిటి? ఒక్కొక్కరికి రూ.కోటి ఖర్చు పెట్టడం ఏమిటని అనుకుంటున్నారా? నిజమేనండి.ఈ రోజుల్లో తమ పెళ్లి వేడుకను( Wedding ) చాలా ఘనంగా జరుపుకోవాలని అందరూ అనుకుంటున్నారు.ధరించే దుస్తులనుండి… నగలు, విందు, పెళ్లి మండపం అంతా గ్రాండ్ గా ఉండాలి అని ప్లాన్ చేస్తున్నారు.
అంతేనా కొంతమంది అయితే ఏకంగా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఎక్కడెక్కడికో పోయి వివాహం చేసుకుంటున్నారు.ఈ క్రమంలో కొంతమంది సముద్రం నడిబొడ్డున షిప్ లో వివాహం చేసుకుంటే, మరికొందరు కొండలు, కోనల్లో వివాహం జరుపుకుంటున్నారు.
దాని కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.ఈమధ్యన శ్రీమంతులే కాకుండా మధ్యతరగతివారు కూడా తమ శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు తమ వివాహ వేడుకకు.
కొంతమంది నీటి అడుగున ఉంగరాలు మార్చుకుంటే, విమానంలో కొందరు తాళి కడుతున్నారు.గాల్లో ఎగురుతు పెళ్లి చేసుకునే జంటలు గురించి కూడా మనం విన్నాం.
ఇక ట్రైన్లో శోభనం అంటూ కొంతమంది వింత పోకడలకు పోయిన పరిస్థితిని చూసాం.
ఈ క్రమంలో వెడ్డింగ్ ఈవెంట్ సంస్థలు కోకొల్లులుగా పుట్టుకొచ్చాయి.అవన్నీ ఒకెత్తయితే కొంతమంది ఏకంగా అంతరిక్షంలో (Space) పెళ్లి చేసుకోవాలని కూడా కలలు కంటున్నా పరిస్థితి.అయితే ఒక కోటి రూపాయలు ఖర్చు చేస్తే అంతరిక్షంలో పెళ్లి చేయడం ఎంతసేపు అంటోంది ఓ సంస్థ.
అవును, అంతరిక్షంలో పెళ్లి చేసుకోవాలనుకునేవారికి మాకంటే బెస్ట్ ప్లానర్స్ లేరంటోందీ సంస్థ.
భూమికి లక్ష అడుగుల ఎత్తులో ‘స్పేస్ పెర్స్‌పెక్టివ్’( Space Perspective ) అనే సంస్థ ఓ స్పేస్ షిప్ ను ఏర్పాటు చేసింది.ఈ వెడ్డింగ్ స్పేస్ షిప్ పేరు నెఫ్ట్యూన్.కార్బన్-న్యూట్రల్ బెలూన్ ద్వారా వీరు వధూవరులను అంతరిక్షంలోకి పంపిస్తారు.
దీనిలో పైలెట్‌తో పాటు ఒకేసారి ఎనిమిదిమంది ప్రయాణించేలా ఏర్పాటు చేశారు.ఆ ఎత్తుకు వెళ్లి, వివాహం పూర్తయ్యాక తిరిగి కిందకు రావడానికి నెఫ్ట్యూన్‌కు 6 గంటల సమయం పడుతుంది.
దీని కోసం అంతరిక్షంలో వివాహాలు చేసుకునేందుకు దాదాపు 1000మంది టికెట్లు చేసేసుకున్నారట.మరి మీరు కూడా ట్రై చేస్తారా?
.