క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన తేజస్విని పండిట్.. రెంట్ వద్దు గడపమన్నాడు అంటూ?

క్యాస్టింగ్ కౌచ్.ఈ పేరు ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది.

 Marathi Actress Tejaswini Pandit Shares A Bad Experience With Apartment Owner ,-TeluguStop.com

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్లు వారికి ఎదురైన చేదు అనుభవాలను బహిరంగంగానే వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇంకొందరు మాత్రం వారికి జరిగిన చేదు అన్యాయాల గురించి బయటకు చెప్పకుండా వారి లోపల దాచుకుంటున్నారు.అయితే క్యాస్టింగ్ కౌచ్ అన్నది కేవలం సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాదని ఇతర రంగాల్లో కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ అన్నది ఉంటుందని తెలిపిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై మరాఠీ నటి తేజస్విని పండిట్ స్పందించింది.తనకు ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.కేవలం సినిమా వాళ్ళ నుంచి మాత్రమే కాకుండా బయట వ్యక్తుల నుంచి కూడా అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతాయని ఆమె తెలిపింది.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ చేదు అనుభవం గురించి పంచుకుంది.

ఆమె 2009 – 2010 ప్రాంతంలో పూణేలోని ఒక అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన అని ఆమె చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

అప్పట్లో నేను నటించిన ఒకటి రెండు సినిమాలు మాత్రమే విడుదల అయ్యాయి.ఉంటున్న ఆ అపార్ట్మెంట్ ఒక కార్పొరేటర్ కు చెందినది.ఒకరోజు నేను అద్దె చెల్లించడానికి అతని కార్యాలయానికి వెళ్ళగా అతను ఆ సమయంలో ఒక ఫేవర్ చేయమని నేరుగా అడిగాడు.అద్దెకు బదులుగా ఇంకేదో చేయమని అడిగాడు అనిచెప్పుకొచ్చింది తేజస్విని పండిట్.

అతను అలా అనగానే వెంటనే అక్కడ ఉన్న టేబుల్ పై వాటర్ గ్లాస్ తీసుకొని అతని ముఖంపై నీళ్లు కొట్టినట్లు తెలిపింది.అటువంటి పనులు చేయడానికి తాను ఆ వృత్తిలోకి రాలేదని అలా చేసి ఉంటే అంతే ఇలాంటి అదే అపార్ట్మెంట్లో ఉండే అవసరం రాదని యజమానికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు ఆమె తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube