రాజకీయాల నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు ఎవరు చెప్పారు అని ప్రశ్నించారు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారిక్కర్.ప్రధాని నరేంద్ర మోడీ తనకు అప్పగించిన లక్ష్యాలను పూర్తి చేసిన తరువాతే గోవా వెళతానని చెప్పారు.
త్వరలో రిటైర్ కావాలన్న ప్లాన్ ఏదీ తన దగ్గర లేదని అన్నారు.మంత్రికి వచ్చే నెల (డిసెంబర్ ) 60 ఏళ్ళు వస్తాయని , డిసెంబర్ 13 వ తేదీన రిటైర్ అవుతారని మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ వార్తలను మనోహర్ తోసిపుచ్చారు.తన ప్రకటనను మీడియా వక్రీకరించిందని, రిటైర్మెంట్ గురించి తాను అసలు మాట్లాడలేదని చెప్పారు.
సాధారణంగా ప్రజలు 60 ఏళ్ళ వయసు రాగానే రిటైర్ అవ్వాలని అనుకుంటారని, తాను కూడా అలాంటి వాడిని కావచ్చని అన్నారు.అయితే కేంద్రంలో తనకు పెద్ద బాధ్యతలు ఉన్నాయని, వాటిని పూర్తీ చేసాకే తిరిగి వెళతానని మంత్రి చెప్పారు.
మంత్రి ఇలా చెప్పగా వచ్చే నలలో ఆయన రిటైర్ అవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.ఇదివరకు గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారిక్కర్ రక్షణ మంత్రిగా ఈ నేలతో ఏడాది పూర్తి చేసుకున్నారు.