రెండో భర్తకు విడాకులు ఇచ్చిన ప్రముఖ నటి.. అప్పటినుంచి విడిగా జీవనం సాగిస్తున్నారా?

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు విడాకులు( Celebrities Divorce ) తీసుకోవడం సర్వ సాధారణం అయిపోతుంది.పెళ్లైన ఏడాది, రెండేళ్లకే విడిపోతూ ప్రముఖ సెలబ్రిటీలు ఫ్యాన్స్ ను ఎంతో బాధ పెడుతున్నారు.

 Manju Pillai  Divorce News Details Here Goes Viral In Social Media ,manju Pillai-TeluguStop.com

తాజాగా మరో ప్రముఖ నటి విడాకులు ఇచ్చి వార్తల్లో నిలిచారు.రెండో భర్తకు విడాకులు ఇచ్చిన మలయాళ నటి మంజు పిళ్లై( Manju Pillai ) పేరు సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగుతోంది.24 సంవత్సరాల పాటు అన్యోన్యంగా జీవనం సాగించిన ఈ జంట ఎవరూ ఊహించని విధంగా విడాకులతో తమ బంధానికి ముగింపు పలికారు.ఆమె భర్త సుజిత్ వాసుదేవ్( Sujith Vasudev ) సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తూ మలయాళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

వాసుదేవ్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Telugu Divorce, Manju Pillai, Manjupillai, Mukundan Menon-Movie

2020 సంవత్సరం నుంచి మంజు పిళ్లై, నేను విడిగానే ఉంటూ జీవనం సాగిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.ఇప్పటికే విడాకుల ప్రక్రియ సైతం పూర్తైందని మంజు పిళ్లై నా భార్య కాదని వాసుదేవ్ పేర్కొన్నారు.నేను, మంజు పిళ్లై భార్యాభర్తలుగా విడిపోయినా మా ఇద్దరి మధ్య స్నేహం ఉందని ఆ స్నేహ బంధం అలాగే కొనసాగుతోందని ఆయన తెలిపారు.

మంజు పిళ్లైను ఇప్పటికీ నా స్నేహితురాలిగానే భావిస్తానని వాసుదేవ్ వెల్లడించారు.

Telugu Divorce, Manju Pillai, Manjupillai, Mukundan Menon-Movie

ప్రస్తుతం మంజు పిళ్లై కెరీర్ పరంగా ఉన్నత స్థాయిలో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.నా క్లోజ్ ఫ్రెండ్ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిదని వాసుదేవ్ తెలిపారు.మంజు పిళ్లై మొదటి భర్త పేరు ముకుందన్ మీనన్( Mukundan Menon ) కాగా పెళ్లైన కొంతకాలం తర్వాత వేర్వేరు కారణాల వల్ల వాళ్లు విడిపోయారు.1992 సంవత్సరం ముంజు పిళ్లై సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube