బ్యాంక్‌లో దోపిడి: దోచిన సొమ్మును రోడ్లపైకి విసిరి క్రిస్మస్ విషెస్

క్రిస్మస్ పర్వదినానికి ముందు అమెరికాలో ఒక వింత సంఘటన జరిగింది.బ్యాంక్‌ను దోచుకున్న ఓ వ్యక్తి బయటికి వచ్చి ఆ సొమ్మును తనతో పాటు తీసుకెళ్లకుండా గాల్లోకి విసురుతూ.

 Man Robbed Bank Throws Money To People And Yells Merry Christmas-TeluguStop.com

రోడ్డుపై వున్నవారికి హ్యపీ క్రిస్మస్ చెప్పడంతో అంతా బిత్తరపోయారు.

కొలరాడో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డేవిడ్ వానే ఒలివర్ అనే పెద్దాయన సోమవారం స్థానిక కొలరాడోలోని అకాడమీ బ్యాంక్‌లోకి చొరబడ్డారు.

ఆయుధంతో సిబ్బందిని బెదిరించి.పెద్ద మొత్తంలో నగదును ఎత్తుకెళ్లారు.

రోడ్డుపైకి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత బ్యాగులోంచి నోట్లను బయటకు తీసి జనంపై చల్లుతూ ‘‘హ్యాపీ క్రిస్మస్.మేరీ క్రిస్మస్’’ అంటూ శుభాకాంక్షలు చెప్పాడు.

Telugu David Oliver, Merry Christmas, Throws-

బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు డేవిడ్ వాన్‌ను అదుపులోకి తీసుకుని, కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఆయన వద్ద ఎలాంటి ఆయుధాలు గుర్తించలేదని, అదే సమయంలో బ్యాంక్‌లో పెద్ద మొత్తంలో సొమ్ము మాయమైనట్లు అధికారులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube