చీపురుకట్ట పట్టిన బాలయ్య.. ఫోటో మాత్రం కేక!

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్ ఇటీవల విడుదలై నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాకు దారుణమైన రివ్యూలు రావడంతో సినిమా చూసేందుకు జనాలు ఆసక్తి చూపించలేదు.

ఇక ఈ సినిమా డిజాస్టర్ దిశగా వెళుతుండగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బాలయ్య విలన్లను నరికే ఫోటోనో, లేక హీరోయిన్ బుగ్గపై ముద్దు పెట్టే ఫోటోనో అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే.బాలయ్య చేతిలో ఓ చీపురు కట్ట ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

రూలర్ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను గోడలకు అతింకించారు.అయితే ఎవరు చేశారో కానీ ఆ పోస్టర్‌లో బాలయ్య బంగిమకు పర్ఫెక్ట్‌గా సరిపోయే విధంగా చీపురుకట్టను పెట్టాడు ఓ ప్రబుద్ధుడు.

ఆ పోస్టర్ చూస్తే బాలయ్య నిజంగా చీపురు కట్ట పట్టుకున్నాడా అనే సందేహం అందరికీ వస్తుంది.ఈ పోస్టర్‌ను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

బాలయ్య యాంటీ ఫ్యాన్స్ నిర్వాకమే అంటూ నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు.మరి ఆ పోస్టర్‌పై మీరు ఓ లుక్కేయండీ.

Advertisement

తాజా వార్తలు