అదిరిపోయే ఆలోచన... చిప్స్ ప్యాకెట్లు, చాక్లెట్ కవర్స్ నుండి గ్లాసెస్ తయారు చేస్తున్నారు!

ఆలోచన ఉండాలేగానీ ఈ ప్రపంచంలో సాధ్యం కానిది అంటూ ఏదీలేదు.‘ఇసుక నుంచి తైలం తీయవచ్చు’ అన్నాడొక మహా కవి.అవును , ఈ మాటలోని మర్మం ఏమిటో నిరూపించదోక కుర్రాడు.అవును, అతగాడు చిప్స్ ప్యాకెట్, చాక్లెట్ రేపర్ల( Chips Packets ) నుంచి సన్ గ్లాసెస్( Sun Glasses ) తయారు చేస్తున్నాడు! వినడానికి ఆశ్చర్యంగా వున్నా, మీరు విన్నది నిజమే.

 Man Making Sun Glasses From Chips Packets And Waste Chocolate Wrappers Details,-TeluguStop.com

అతగాడి ఆలోచన సమాజానికి, పర్యావరణానికి మేలుచేసేదిగా ఉండడంతో సదరు స్టార్టప్ ని చాలామంది మెచ్చుకుంటున్నారు.నేటి యువత టెక్నాలజీ అని కొట్టుకుంటుంటే ఆ కుర్రాడు సోషల్ రెస్పాన్సిబిలిటీ వుండాలనే ధ్యాసతో పనిచేయడం అభినందనీయం.

Telugu Anil Malpani, Bussiness Idea, Chips, Chips Packet, Choclate Pack, Cups, L

అతని పేరు అనిష్ మల్పానీ( Anil Malpani ). అతగాడు ఒకసారి ముంబైలోని చెంబూర్ లాండ్ ఫిల్ ఏరియా నుంచి వెళుతుంటే, అక్కడ గుట్టలు గుట్టలుగా పడివున్న చెత్తను చూసి ఆశ్చర్యపోయాడట.అందులో రీ సైకిల్ అవ్వకుండా వందల సంవత్సరాలు భూమ్మీద ఉండిపోయే వేస్టేజీనే ఎక్కువ.ఇలాంటి వ్యర్ధాలకు బ్రాండ్ వాల్యూ తీసుకొస్తే ఎలా వుంటుందనే ఆలోచన నుంచే అప్పుడే పుట్టిందట అతగాడికి.

అతని ఆలోచననుండి పుట్టినదే ఆశయ స్టార్టప్. అవును, అతను అమెరికాలో చేస్తున్న జాబ్ ని వదిలేసి సమాజానికి ఏదో చేయాలనే తపనతో వచ్చేసాడట.

Telugu Anil Malpani, Bussiness Idea, Chips, Chips Packet, Choclate Pack, Cups, L

అలాంటి ఐడియాలజీకి ఈ వేస్టేజీ ఒక ఊతంగా దొరికింది అతగాడికి.దాంతో చాక్లెట్ రేపర్లు, చిప్స్ ప్యాకెట్లు, మల్టీ-లేయర్డ్ ప్యాకేజింగ్ వ్యర్థాలతో పనికొచ్చే ప్రాడక్ట్ తయారు చేయాలని అనుకున్నాడు.అనుకున్నదే తడవుగా ఒక టీం కూడా తయారుచేసుకున్నాడు.వ్యర్థాల విలువను పెంచే మార్గాలను ఆ టీం అన్వేషించింది.ఇప్పటికే, పిఈటీ, హెచ్ డి పి సీసాలు రీసైకిల్ అవుతున్నాయి.కానీ ఎవరూ చేయని సమస్యలపై పనిచేయాలని అనుకున్నాడు.

ఈ క్రమంలో మొదటి ఏడాదిన్నర ‘ఎంపియల్’ నుంచి హైక్వాలిటీ మెటీరియల్ తెచ్చే టెక్నాలజీపై పనిచేశారు.వ్యర్థాలను సేకరించేవారికి ఉపాధిని కల్పించడం ఈ స్టార్టప్ మరో ఉద్దేశం కూడా.

అంతేకాకుండా వీరికి వచ్చిన ఆదాయంలో 10శాతం వ్యర్థాలను సేకరించేవారి పిల్లల చదువుకు కేటాయించడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube