సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అంటూ దాదాపు సంవత్సరం క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది.కానీ పలు కారణాల వల్ల సినిమా ఇన్నాళ్లు కార్యరూపం దాల్చలేదు.
పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని కూడా నెలలు అవుతున్న షూటింగ్ కార్యక్రమాలకు మాత్రం మోక్షం కలగలేదు.ఎట్టకేలకు దర్శకుడు త్రివిక్రమ్ నేడు ఫస్ట్ క్లాప్ కొట్టాడు.
మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అంటే టాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆ అంచనాలకు తగ్గట్లుగానే దర్శకుడు త్రివిక్రమ్ భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో సినిమాను రూపొందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాను నమ్మకాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.
షూటింగ్ నేడు ప్రారంభం అయిందో లేదో అప్పుడే సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
ఒకటి రెండు రోజుల్లోనే సినిమా నిర్మాణ సంస్థ నుండి సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ లేదా ఆసక్తికర విషయం ఒకటి రాబోతున్నట్లుగా విశ్వసనీయంగా సమాచారం అందుతుంది.అది ఏంటి అనేది ఇప్పటికీ సస్పెన్స్ గా ఉంది, కానీ మహేష్ బాబు అభిమానుల కోసం కచ్చితంగా ఏదో సర్ప్రైజ్ అయితే ఒకటి రెండు రోజుల్లో రాబోతుంది అనేది పక్క సమాచారం.
అతి త్వరలోనే అది ఏంటి అనేది కూడా మేము మీకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తాం. మహేష్ బాబు జోడిగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తారీఖున ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
మహేష్ బాబుకు ఈ సినిమా 28వ సినిమా కాగ 28వ తారీకు విడుదల అవ్వడం అనేది సెంటిమెంట్ గా వర్క్ అవుట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.