రోజుకు 15 సిగరెట్లు తాగడం కంటే.. ఒంటరితనం అత్యంత ప్రమాదకరం : యూఎస్ సర్జన్ జనరల్ వివేక్‌మూర్తి

ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం, సోషల్ మీడియా రాక కారణాలేవైనా సరే ప్రస్తుతం మానవ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.యువత నుంచి వృద్ధుల వరకు అంతా ఒంటరితనంతో బాధపడుతున్నారు.

 Loneliness As Deadly As Smoking 15 Cigarettes A Day, Says Indian-origin Us Surge-TeluguStop.com

అయితే వృద్ధుల కంటే 22 ఏళ్ల లోపు యువతే ఎక్కువగా ఒంటరితనంతో బాధపడుతున్నట్లు అనేక సర్వేలు చెబుతున్నాయి.ప్రతి ఐదుగురిలో ఒకరు .తమకు సన్నిహితంగా ఎవరూ లేరని, అప్యాయంగా మాట్లాడేందుకు ఆత్మీయులే కరువయ్యారని భావిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.తాజాగా ఇదే విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు భారత సంతతికి చెందిన అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి( American Surgeon General Vivek Murthy ).

Telugu Cigarettes, Program, Indianorigin, Surgeongeneral-Telugu NRI

ప్రతిరోజూ 15 సిగరెట్‌లు( 15 cigarettes ) కాల్చే వారితో పోలిస్తే ఒంటరితనంతో బాధపడుతున్న వారే ప్రమాదానికి అత్యంత చేరువలో వున్నారని ఆయన వ్యాఖ్యానించారు.అమెరికాలోని పెద్దలలో సగం మంది తాము ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లు చెప్పారని వివేక్ తెలిపారు.దీనికి సంబంధించి సర్జన్ జనరల్ కార్యాలయం 81 పేజీల నివేదికను విడుదల చేసింది.ఈ సందర్భంగా వివేక్ మూర్తి మాట్లాడుతూ.ఒంటరితనం అనేది కూడా శరీరం, మనసు అనుభవించే ఒక సాధారణ అనుభూతి.ఇది కూడా ఆకలి, దాహం లాంటిదేనని సర్జన్ జనరల్ పేర్కొన్నారు.

మన మనుగడకు అవసరమైనది దొరకనప్పుడు శరీరం మనకు కొన్ని సిగ్నల్స్ పంపుతున్న తరహాలోనే ఒంటరితనం కూడా అని ఆయన చెప్పారు.అమెరికాలో లక్షలాది మంది ప్రజలు ఒంటరితనంతో బాధపడుతున్నారని వివేక్ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిని పరిష్కరించేందుకు గాను డిక్లరేషన్ ప్రోగ్రామ్‌ను ( Declaration Program )రూపొందించామని ఆయన చెప్పారు.

Telugu Cigarettes, Program, Indianorigin, Surgeongeneral-Telugu NRI

గడిచిన కొన్ని దశాబ్ధాలుగా అమెరికన్లు ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సంస్థలు, సొంత కుటుంబ సభ్యులతో తక్కువగా గడుపుతున్నారు.గత 60 ఏళ్లలో ఒంటరి కుటుంబాల సంఖ్య కూడా రెట్టింపు అయ్యిందని నివేదిక చెబుతోంది.సరిగ్గా ఇదే సమయంలో కోవిడ్ 19 విజృంభించడంతో విధించిన నిబంధనల కారణంగా మిలియన్ల మంది అమెరికన్లు స్నేహితులకు, బంధువులకు దూరంగా ఇంట్లో ఒంటరిగా వుండిపోవాల్సి వచ్చిందని తెలిపింది.2020లో అమెరికన్లు తమ స్నేహితులతో రోజుకు 20 నిమిషాలు మాత్రమే వ్యక్తిగతంగా గడపగా.రెండు దశాబ్ధాల క్రితం ఇది రోజుకు 60 నిమిషాలుగా వుండేది.

ముఖ్యంగా 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు వున్న యువతను ఒంటరితనం వేధిస్తోంది.అంతేకాదు.

రోజుకు రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడిపే వ్యక్తులు సామాజికంగా ఒంటరిగా వున్నట్లు నివేదిక పేర్కొంది.ఒంటరితనం అకాల మరణ ప్రమాదాన్ని దాదాపు 30 శాతం పెంచుతుందని.

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం వుంటుందని నివేదిక హెచ్చరించింది.పని ప్రదేశాలు, విద్యా సంస్థలు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌లు, తల్లిదండ్రులు, ఇతరులు .మనుషుల మధ్య అనుసంధానాన్ని పెంచే చర్యలు చేపట్టాలని వివేక్ మూర్తి కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube