సలార్ మూవీకి అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేసిన తెలంగాణ కుర్రాడు.. ఇతని సక్సెస్ కు గ్రేట్ అనాల్సిందే!

టాలెంట్ ఉండాలే కానీ వయసుతో సంబంధం లేదు అని ఇప్పటికే చాలా సందర్భాలలో చాలామంది నిరూపించిన విషయం తెలిసిందే.అలా చాలా మంది ఒక్కొక్క రంగంపై దృష్టి సారిస్తూ వారి టాలెంట్ ని బయట పెడుతూ ఎంతో మంది మన్నలను పొందుతున్నారు.

 Latest News About Salaar Assitant Editor Ramagiri Vishnu, Salaar, Ramagiri Vishn-TeluguStop.com

అటువంటి వారిలో తెలంగాణ కుర్రాడు కూడా ఒకరు.తను టాలెంటుగా పాన్ ఇండియా హీరో మూవీలో అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు? అతను ఏమి విజయం సాధించాడు అన్న వివరాల్లోకి వెళితే.

Telugu Salaar, Ramagiri Vishnu, Tollywood-Movie

అతను మరెవరో కాదు రామగిరి విష్ణు.( Ramagiri Vishnu ) తెలంగాణ కడెం ప్రాంతానికి చెందిన ఈ రామగిరి విష్ణు సినిమాలపై తనకున్న ఆసక్తితో ఆ రంగంలోకి అడుగుపెట్టెలా చేసింది.ఆ దిశగా వెళ్లేందుకు సొంతంగా ఒక కంప్యూటర్‌ కొనుక్కొని యూట్యూబ్‌ ద్వారా మెలకువలు నేర్చుకొని అసిస్టెంట్‌ ఎడిటర్‌గా( Assistant Editor ) రాణిస్తున్నాడు.

అంతేకాకుండా ఏకంగా ఇటీవల విడుదలైన పాన్ ఇండియా హీరో ప్రభాస్‌ ( Prabhas )నటించిన సలార్‌ చిత్రానికి అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశాడు.విష్ణు హైదరాబాద్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

తల్లిదండ్రులు శ్రీనివాస్‌-లత.తండ్రి దర్జీ పనిచేస్తుంటారు.

Telugu Salaar, Ramagiri Vishnu, Tollywood-Movie

అయితే ఇంటర్‌ పూర్తిచేసిన విష్ణు ప్రస్తుతం డిగ్రీ చదువుతూనే సినిమారంగంపై ఉన్న మక్కువతో ఎలాగైనా అందులో చేరాలని ఎడిటింగ్‌ విభాగంలో మెలకువలను నేర్చుకున్నాడు.యూట్యూబ్‌ ద్వారా ఎప్పటి కప్పుడు తన అనుమానాలు నివృత్తి చేసుకుంటూ చేసిన ఎడిటింగ్‌లను చిత్ర దర్శకులకు పంపించాడు.సలార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ ఈయనకు అవకాశం ఇవ్వడంతో సినిమాలో పనిచేశాడు.మొదటిసారే అగ్రహీరో సినిమాకు అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేసి రాణించడం పట్ల పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అయితే విష్ణు గతంలో కల్యాణ్‌ దర్శకత్వంలో విడుదలైన మ్యాడ్‌ సినిమాకు సైతం ఈయన పనిచేశాడు.ప్రస్తుతం గ్యాంగ్‌ ఆఫ్‌ గోదావరి, లక్కీ భాస్కర్‌ చిత్రాలకు సైతం అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు.

ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన విష్ణు సొంతంగా నేర్చుకుని ఈ రంగంలోకి వెళ్లడంతో మిత్రులు, కడెం వాసులు అభినందిస్తున్నారు.ఇక ముందు ముందు మంచి మంచి అవకాశాలను అందుకోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube