పాన్ ఇండియన్ వ్యాప్తంగా మోస్ట్ ఏవైటెడ్ మూవీగా ఉన్న ”సలార్”( Salaar ) మొన్న శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా ఇక ఎక్కడ తగ్గకుండా దూసుకు పోతుంది.
డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు తగిన ఫలితం రావడంతో వీరి ఆనందం అంత ఇంత కాదు.

ఆదిపురుష్ వంటి ప్లాప్ తర్వాత మళ్ళీ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో చేసిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తో బాహుబలి రేంజ్ లో హిట్ అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్నాడు.దాదాపు ఆరేళ్ళ ఫ్యాన్స్ నిరీక్షణ తర్వాత ప్రభాస్ కు హిట్ అనేది పడింది.దీంతో తమ హీరో కంటే ఫ్యాన్స్ నే ఎక్కువ హంగామా చేస్తూ ఈ హిట్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక సలార్ సినిమా విడుదల అయ్యిన అన్ని చోట్ల ఒకే రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.మొదటి రోజు 178 దాదాపు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసాడు.ఇక యుఎస్ మార్కెట్ లో కూడా డార్లింగ్ ప్రభంజనం మాములుగా లేదు.రెండు రోజుల్లోనే ఏకంగా 4.7 మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేసినట్టు తాజాగా యుఎస్ డిస్టిబ్యూటర్స్ తెలిపారు.మరి ఇంకా వీకెండ్ పూర్తి అవ్వలేదు.
అలాగే క్రిస్మస్ హాలిడే కూడా ఉంది.ఇక ఈ రెండు రోజులు కూడా ప్రభాస్ స్టామినాతో 500 కోట్ల మార్క్ క్రాస్ చేసే అవకాశం కనిపిస్తుంది.
చూడాలి ఏం జరుగుతుందో.మొత్తానికి సలారోడి దెబ్బకు బాక్సాఫీస్ అల్లాడిపోతుందనే చెప్పాలి.







