ఐదుగురు సీఎంలతో సినిమాల్లో నటించిన నటి ఎవరంటే..?

తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి నటిగా మనోరమ పాపులారిటీని సొంతం చేసుకున్నారు.1500కు పైగా సినిమాల్లో నటించిన మనోరమ తన సినీ కెరీర్ లో ఎన్నో ఘనవిజయాలను సొంతం చేసుకున్నారు.ఇతర భాషలతో పోలిస్తే మనోరమ తమిళంలో ఎక్కువగా నటించడం గమనార్హం.అభిమానులు మనోరమను ప్రేమతో ఆచి అని పిలుస్తారు.

 Late South Indian Actress Manorama Acts With  Almost Five Chief Ministers In Her-TeluguStop.com

సినీ నటిగా మనోరమ గిన్నీస్ బుక్ లో సైతం స్థానాన్ని సంపాదించుకోవడం గమనార్హం.ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో 1987 సంవత్సరంలో నటించడంలో గిన్నీస్ రికార్డ్ ఆమె సొంతమైంది.

అయితే మనోరమ మరో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నారు.ఈ నటి ఏకంగా ఐదుగురు సీఎంలతో సినిమాల్లో నటించడం గమనార్హం.

సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న పలువురు నటులు రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రులయ్యారు.

అలా ముఖ్యమంత్రులైన నందమూరి తారకరామారావు, జయలలిత, కరుణానిధి, ఎం జి రామచంద్రన్, అణ్ణా దురైలతో కలిసి నటించారు.1958 సంవత్సరంలో నటిగా తెరంగేట్రం చేసిన మనోరమ సింగం 2 సినిమాలో చివరిగా నటించారు.మనోరమగా పాపులారిటీని సంపాదించుకున్న ఈ నటి అసలు పేరు గోపి శాంత కావడం గమనార్హం.2015 సంవత్సరం మనోరమ గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందారు.

మనోరమ నటనకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

తమిళంలోని స్టార్ హీరోల సినిమాలలో ఎక్కువగా మనోరమ నటించారు.తెలుగులో అరుంధతి సినిమా మనోరమకు మంచి పేరు తెచ్చిపెట్టింది.నేడు మనోరమ పుట్టినరోజు కావడం గమనార్హం.1937 సంవత్సరంలో మనోరమ జన్మించారు.తమిళనాడు రాష్ట్రంలోని మన్నార్ గుడి ఆమె స్వస్థలం.ఆమె గిన్నీస్ బుక్ లో ఎక్కి క్రియేట్ చేసిన రికార్డును 2009 సంవత్సరం వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.

సినిమాల్లోకి రాకముందు మనోరమ 1000కు పైగా నాటక ప్రదర్శనలు కూడా ఇవ్వడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube