కేంద్ర మంత్రి గా ఈటెల .. భార్యకు టికెట్ ? బీజేపీ ఆఫర్ ?

టిఆర్ఎస్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది అనే ప్రచారం జరుగుతోంది.

ఆయనతో బిజెపి జాతీయ నాయకులతో పాటు , తెలంగాణ బిజెపి నాయకులు చర్చలు జరిపారు.

తమ ఉమ్మడి శత్రువైన కేసీఆర్ ను ఢీ కొట్టేందుకు కలిసి పనిచేద్దామనే ఆఫర్ ను ఈ సందర్భంగా బీజేపీ ఇచ్చిందట.అంతేకాకుండా తమ పార్టీలో చేరితే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంతో పాటు, కేంద్ర మంత్రిగా అవకాశం కల్పిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

  ఈ ఆఫర్ తో ఈటెల కూడా సంతృప్తి వ్యక్తం చేశారని, తన నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తానని ఆ చర్చల సందర్భంగా చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.  అతి త్వరలోనే టిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎలాగూ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో ఈటెల రాజేందర్ ఉండడంతో,  ఆ స్థానంలో బిజెపి తరఫున రాజేందర్ భార్యకు టికెట్ ఇస్తామని ఆఫర్ ను కూడా బిజెపి ఇవ్వడంతో,  ఆ ప్రతిపాదనకు ఆయన  సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

ఇప్పటికే హుజురాబాద్ లో ఎన్నికలు వస్తాయని టిఆర్ఎస్ బలంగా నమ్ముతున్న డంతో,  అక్కడ పార్టీ కేడర్ ఎవరూ ఈటెల రాజేందర్ వెంట వెళ్లకుండా,  మంత్రులు గంగుల కమలాకర్ తోపాటు హరీష్ రావు ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ వంటి వారిని మోహరించారు.నియోజకవర్గంలో టిఆర్ఎస్ పట్టు కోల్పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో ఒంటరిగా టిఆర్ఎస్ ను ఢీకొట్టడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని , బిజెపి అండదండలు ఉంటే ఇప్పుడే కాకుండా, రానున్న రోజుల్లోనూ రాజకీయ భవిష్యత్ కు ఎటువంటి ఢోకా ఉండదు అనే విషయాన్ని ఈటెలకు బిజెపి నేతలు చెప్పడంతో ఆలోచనలో పడ్డ ఆయన బిజెపి వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు తనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తులతో ఈటెల సమాలోచనలు చేస్తున్నారట.

తెలంగాణలో అధికారం సంపాదించుకోవాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్న బిజెపికి మాస్ లీడర్ గా, ఉద్యమ నేపథ్యం ఉన్న ఈటెల రాజేందర్ కలిసివస్తే బిజెపి శక్తి తెలంగాణలో మరింత పెరుగుతుందని, 2023 ఎన్నికల్లో తాము అనుకున్న విధంగా తెలంగాణలో అధికారంలోకి రావడం మరింత సులభం అవుతుందనే అభిప్రాయంలో బీజేపీ నేతలు ఉన్నారట.ఏది ఏమైనా రాజ్యసభ, కేంద్ర మంత్రి పదవి, తన భార్యకు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ వంటి విషయాలతో ఈటెల బీజేపీ వైపు ఎక్కువ మక్కువ గా ఉన్నారట.

Advertisement

తాజా వార్తలు