నటి రోజా గొప్పతనం గురించి వివరించిన లలిత జ్యువెలర్స్ ఎండి!

రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 45 బ్రాంచ్లను ఏర్పాటు చేసి అందరికీ ఎంతో చేరువైనటువంటి వారిలో లలిత జ్యువెలర్స్ ఓనర్ ఎండి కిరణ్ ఒకరు.డబ్బులు ఊరికే రావు అనే ఒక డైలాగ్ తో ఈయన ఎంతో ఫేమస్ అయ్యారు.

 Lalitha Jewellers Md Kiran Describes The Greatness Of Actress Roja Details, Lali-TeluguStop.com

ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో బ్రాంచ్లను ఏర్పాటు చేసిన ఈయన తాజాగా చిత్తూరులో లలిత జ్యువెలర్స్ బ్రాంచ్ ఏర్పాటు చేశారు.అయితే ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ టూరిజం శాఖ మంత్రి సినీనటి రోజా గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

Telugu Actress Roja, Chittoor, Greatness Roja, Lalithajewelers, Roja-Movie

రోజా చేతుల మీదుగా చిత్తూరు జిల్లాలో లలిత జ్యువెలర్స్ కొత్త షోరూం ప్రారంభమైంది.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రోజా చేతుల మీదగా రిబ్బన్ కట్ చేసి ఈ షోరూం ప్రారంభించారు.అయితే ఈ కార్యక్రమం పూర్తి అయిన అనంతరం నటి, మంత్రి రోజా గురించి లలిత జ్యువెలర్స్ ఓనర్ ఎండి కిరణ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కొత్త షోరూం ప్రారంభించడానికి రోజా గారిని ఆహ్వానించడం కోసం తన టీం మొత్తం కలిసి తన ఇంటికి వెళ్లినట్లు తెలిపారు.

Telugu Actress Roja, Chittoor, Greatness Roja, Lalithajewelers, Roja-Movie

రోజా గారి ఇంటికి మేము వెళ్ళగానే మాకు ఎంతో మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికి విందు భోజనాలను ఏర్పాటు చేశారు.ఇలా మర్యాదలు చేయడం తమకు ఎంతో సంతోషంగా అనిపించిందని, అది ఆమె గొప్పతనం అని ఈయన తెలిపారు.మా ఆహ్వానం మేరకు రోజా గారు మా షోరూం ప్రారంభించినందుకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ కిరణ్ తెలిపారు.మనం అనుకున్న గెస్ట్ వచ్చి షోరూమ్ ప్రారంభిస్తే కలిగే సంతోషమే వేరు అంటూ ఈయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రోజా గురించి కిరణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube