షేక్ అహ్మద్ పాషా అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ కుర్చీ తాత(Kurchi Thatha)అంటే మాత్రం టక్కున ఈయన అందరికీ గుర్తుకు వస్తారు.కుర్చీ మడత పెట్టే అనే ఒక డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయినటువంటి ఈయన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.
ఈయన వాడినటువంటి కుర్చీ మడత పెట్టే అనే డైలాగ్ ఏకంగా మహేష్ బాబు(Mahesh Babu) సినిమాలో రిఫరెన్స్ గా తీసుకొని పాట క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి ఇక ఈ పాట ఇటీవల విడుదల చేసిన తర్వాత కుర్చీ తాత మరింత ఫేమస్ అయ్యారు.
ఇకపోతే తాజాగా ఈయన వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు.ఈ పాట కోసం తనకి ఇచ్చిన రెమ్యూనరేషన్ గురించి కూడా ఈయన వెల్లడించారు.అయితే తనకు ఇతర సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఈయన తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని తెలిపారు.
అల్లు అర్జున్ సినిమాలో కూడా తనకు సినిమా అవకాశం వచ్చిందని ఫిబ్రవరి నెలలోనే షూటింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఫిబ్రవరి నెలలో అల్లు అర్జున్ (Allu Arjun) తో సినిమా షూటింగ్ ఉండొచ్చు అంటూ కుర్చీ తాత చెప్పారు అంటే బహుశా ఈయనకు పుష్ప 2 సినిమాలో నటించే అవకాశం వచ్చిందేమోనని పలువురు భావిస్తున్నారు.నిజంగానే పుష్ప 2(Pushpa 2)లో కనుక కుర్చీ తాతకు అవకాశం వచ్చి ఉంటే ఆయన క్యారెక్టర్ మరో లెవల్ లో ఉంటుంది అంటూ అభిమానులు భావిస్తున్నారు.
మరి ఈయన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందనే విషయాలు తెలియాల్సి ఉంది.