నేడు అత్యవసరమైతే తప్ప బ్యాంకు బ్రాంచ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు.దాదాపుగా అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు ఆన్‌లైన్‌లోనే చిటికెలో జరిగిపోతున్నాయి.
ప్రస్తుతం UPI (డిజిటల్ పేమెంట్స్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) అత్యంత ప్రాచుర్యం పొందింది.ఎందుకంటే దీనిద్వారా సులువుగా, వేగంగా, సెక్యూర్‌గా ట్రాన్సాక్షన్లు పూర్తి చేసే వెసులుబాటు ఉండటంతో ఎక్కువ మంది ప్రజలు ఈ పేమెంట్ మోడ్‌ను వినియోగిస్తున్నారు.
NPCI (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఇటీవల UPIకి చెందిన రెండు కొత్త వెర్షన్లను లాంచ్ చేసింది.అవే UPI లైట్, UPI 123Pay.
అయితే చాలామందికి వాడుతున్నారు కానీ, ఈ రెండు వెర్షన్‌ల మధ్య తేడా తెలియడం లేదు.దాంతో కొన్ని సమస్యలు వస్తున్నాయి.
UPI 123 పే అనేది ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టమ్ అని అందరికీ తెలిసినదే.ఇక UPI 123 పే ద్వారా ఫీచర్ ఫోన్ వినియోగదారులు చాలా మార్గాలలో ట్రాన్సాక్షన్లను నిర్వహించవచ్చు.
దీని ద్వారా ఈ ట్రాన్సాక్షన్లను నిర్వహించడానికి ప్రత్యేక ఆథరైజేషన్ లేదా UPI పిన్ అవసరం లేదు.ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా అవసరం లేదు.UPI లైట్ పేమెంట్ ద్వారా గరిష్టంగా రూ.200 పే చేయవచ్చు.ఆన్-డివైజ్ వాలెట్‌కు UPI లైట్ ద్వారా యాడ్ చేసే బ్యాలెన్స్ రూ.2,000కి మించకూడదు.
మనలో చాలామందికి UPI లైట్ అంటే ఏమిటో తెలియదు.దీని అర్ధం… ‘ఆన్-డివైస్ వాలెట్.’ అంటే దీన్ని ఉపయోగించడం కోసం, వినియోగదారులు ముందుగా తమ బ్యాంక్ ఖాతాల నుంచి యాప్ వాలెట్‌కు డబ్బును యాడ్ చేయాల్సి ఉంటుంది.ఆ తర్వాత ఇంటర్నెట్ లేకుండా కూడా రియల్‌టైమ్ పేమెంట్స్ ఈజీగా చేయవచ్చు.
UPI లైట్ ఫీచర్ ద్వారా UPI నెట్‌వర్క్‌లను వినియోగదారులు యాక్సెస్ చేయవచ్చు.అదే విధంగా ఫోన్‌ల ద్వారా బ్యాంక్ అకౌంట్స్ నుంచి నేరుగా డిజిటల్ పేమెంట్స్ చేసే అవకాశం కలదు.