ఏపీ సీఎం పై ప్రసంశల వర్షం కురిపిస్తున్న కేజ్రీ, విషయం ఏమిటంటే

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్ ప్రశంశల వర్షం కురిపించారు.హైదరాబాద్ లో చోటుచేసుకున్న దిశ ఘటన తరువాత ఏపీ సీఎం దిశ పేరు తో ఒక చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

 Kejriwal Praises To Ap Cm Jaganmohan Reddy-TeluguStop.com

అయితే ఈ దిశ చట్టం పై ఢిల్లీ సర్కార్ కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తుంది.మహిళలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష పడేలా చారిత్రాత్మక దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ మూడు రోజుల క్రితం ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేయడం తో ఈ కొత్త చట్టం అమలులోకి రానుంది.అయితే ఈ చట్టం పై ఆసక్తి కనబరచిన కేజ్రీ వాల్ ఏపీ సర్కార్ కు ఈ దిశ చట్టం కాపీ తమకు పంపాలి అంటూ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది.

ఈ కొత్త దిశ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు గనుక నేరం రుజువైతే దోషికి కేవలం 21 రోజుల్లోనే విచారణ ముగించి, ఉరిశిక్ష అమలు చేయనున్నారు.ఇప్పటివరకు ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని కుదించి కేవలం 21 రోజుల్లోనే కేసులను పరిష్కరించాలని అంటూ ఏపీ సర్కార్ ఈ బిల్లును ప్రవేశ పెట్టింది.

Telugu Ap Disha, Delhi, Kejriwal, Kejriwalpraises-

అయితే ఏపీ సర్కార్ చేసిన ఈ ప్రతిపాదనకు ప్రతి పక్షాలు కూడా అంగీకారం తెలపడం తో అసెంబ్లీ లో ఈ చట్టానికి ఆమోద ముద్ర లభించింది.దీనితో గవర్నర్ కూడా ఈ చట్టానికి ఆమోద ముద్ర వేశారు.అయితే ఈ చట్టం పై కేజ్రీ వాల్ ప్రశంశల వర్షం కురిపించి ఈ చట్టం కాపీ ని తమకు పంపాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube