వాట్ ఎ టాలెంట్: యువతి టాలెంట్ కు దాసోహం అంటున్న నెటిజన్స్..!

ప్రతి ఒక్క భారతీయుడు కూడా మన జాతీయ గీతం వింటే చాలు లేచి నిలబడి మరి తమ దేశభక్తిని చాటుకుంటారు.జాతీయ గీతం వింటే చాలు మన మది ఆనందంతో పులకరించిపోతుంది.

 Karnataka Student Carved National Anthem On Leaves Gets India Book Of Records De-TeluguStop.com

అలాంటి మన దేశ జాతీయ గీతాన్ని ఆకులలో రూపొందించడం అంటే మాములు విషయం కాదు అనే చెప్పాలి.ఒక విద్యార్థిని తనకు ఉన్న టాలెంట్ తో విభిన్న కళాకృతులను రూపొందిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

కేవలం ఒక్కరోజులోనే ఆకులతో జాతీయ గీతాన్ని రాసి ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్​లో చోటు సంపాదించింది.

ఆకులపై జాతీయ గీతం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.? కానీ ఈ యువతి మాత్రం అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసి చూపించి అందరిని ఆశ్చర్యపరిచింది.మన జాతీయ గేయాన్ని ఆకులపై చెక్కి వారెవ్వా అనిపిస్తుంది.

వివరాల్లోకి వెళితే.కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో సిద్దాపుర్​ కు చెందిన తృప్తి మంజునాథ అనే విద్యార్థిని కార్వారాలోని బాదా శివాజి ఇంజనీరింగ్ కళాశాలలో బీఈడీ రెండో సంవత్సరం చదువుతోంది.

సాధారణ రైతు కుటుంబానికి చెందిన తృప్తి మంజునాథకు మొదటి నుంచి లీఫ్ ఆర్ట్స్​పై ఇంట్రెస్ట్ ఉండేది.ఆ ఆసక్తితోనే పలు రకాల ఆర్ట్స్ వేసేది.

ఈ క్రమలోనే ఈ ఏడాది మే 19న మన దేశ జాతీయ గీతాన్ని ఆకులపై హిందీలో తీర్చిదిద్దింది.కళల్లో కెల్లా లీఫ్ ఆర్ట్ అనేది చాలా భిన్నమైనదిగా తృప్తి చెబుతుంది.

Telugu Fidda, India, Karnataka, Leaf Art, Nationalanthem, Netizens, Latest-Lates

లీఫ్ ఆర్ట్ లో భాగంగా ఆకు మిగతా భాగాన్ని అంతా కట్ చేసి, కేవలం కావాల్సిన చిత్రాన్ని తయారుచేయడమే లీఫ్ ఆర్ట్స్​.తృప్తి వేసిన లీఫ్ ఆర్ట్ కు ఇండియా బుక్ ఆఫ్​ రికార్డ్​లో చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందని తృప్తి మంజునాథ అంటుంది.అంతేకాకుండా తనకు ఉన్న ఈ టాలెంట్ ను ఎవరైనా నేర్పించమని అడిగితే కచ్చితంగా నేర్పిస్తానని చెబుతోంది తృప్తి.జాతీయ గీతంతో పాటుగా పువ్వులు, జంతువులు లాంటి రకరకాల కళాకృతులను కూడా ఆకులపై తీర్చిదిద్దాను అని చెప్తుంది తృప్తి.

మొత్తంగా లీఫ్ ఆర్ట్ లో భాగంగా 8 ఆకులను ఉపయోగించింది.ఈ లీఫ్ ఆర్ట్ సాధనలో తన కుటుంబ సభ్యులు తనకు ఎంతగానో సహాయం చేశారు అని తృప్తి చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube