విశ్వ కర్మకు శ్రీనివాసునికీ గల సంబంధమేమి?

విశ్వకర్మ దేవశిల్పి.ఇతని తండ్రి ప్రభావసుడనే వసువు.తల్లి యోగ సిద్ధి.ఈ శిల్పి భార్య పేరు ప్రహ్లాదిని.సంజ్ఞ ఈయన పుత్రిక.విశ్వకర్మ దేవతల కనువైన ప్రాసాదాలు, పట్టణాలు, రథాలు, ఆయుధాలు మొదలైనవి నిర్మించి ఇస్తూ ఉంటాడు.

 Differences Between Vishwa Karma And Srinivasudu , Devotional, Srinivasudu, Telu-TeluguStop.com

సూర్యుడు విశ్వ కర్మ పుత్రిక అయిన సంజ్ఞను భార్యగా స్వీకరిం చాడు.కానీ ఆమె సూర్యుని తేజస్సును సహించలేక పోయింది.

అప్పుడు విశ్వకర్మ తేజస్సును తగ్గించడం కోసం సూర్యుడిని సాన పట్టాడు.ఆ సందర్భంలో రాలిన చూర్ణముతోనే సుదర్శన చక్రం రూపొందింది.

కానీ సూర్యుడి తేజస్సు ఏమాత్రం తగ్గలేదు.దీంతో సంజ్ఞ తన నీడ నుంచి ఛాయను తయారు చేసింది.

సంజ్ఞ తన పుట్టింటికి వెళ్లి ఛాయను సూర్యుడి వద్దకు పంపింది.అయితే చాలా కాలం సూర్యుడు ఛాయను గుర్తించలేదు.

తన వద్ద ఉన్నది తన భార్య సంజ్ఞే అనుకుని కాపుం చేశాడు.

శ్రీ నివాసుడు సుదర్శన చక్రాన్ని ఆయుధంగా స్వీకరించాడు.

ఆ రీతిగా శ్రీనివాసునికి దివ్యమైన చక్రాయుధాన్ని తయారు చేయడంలో విశ్వ కర్మ భగ వానుడు ప్రముఖ పాత్ర వహించాడు.మరియు పద్మావతీ శ్రీనివాసులకు వివాహం నిర్ణయమైన పురానికి పోయి ఒక పెద్ద భవనం నిర్మింప జేయమన్నాడు.

అట్లే పోయి ఇంద్రుడు విశ్వ కర్మచే మరకత మణి తోరణాలు గల ఒక కనక మందిరం నిర్మించాడు.ఇలా శ్రీనివాసుని వివాహ భవనాన్ని నిర్మించిన వాడు విశ్వ కర్మయే.

ఇదే వీరిద్దరికి ఉన్న సంబంధం.అయితే విశ్వకర్మ కేవలం శ్రీనివాసుడికే కాకుండా మిగతా దేవుళ్లకు కూడా రథాలు, భవనాలు, నగలు, నట్రలు చేసి ఇస్తాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube