‘జిహ్వకోరుచి’ అన్న చందంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాలందరూ తమ ఇష్టాలకు అనుగుణంగా రక రకాల డిజైన్లు, కలర్లు కలిగిన ఆకర్షణీయమైన ఫ్యాషనబుల్ దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు.అయితే ఎవరు ఏ రకం డ్రెస్ వేసుకున్నా అందరూ కామన్‌గా ధరించేది మాత్రం ఒక్కటే.
అదే అండర్ వేర్.స్త్రీ, పురుషులెవరైనా అండర్‌వేర్‌ను తప్పనిసరిగా ధరిస్తారు.
కొంత మంది అండర్‌వేర్‌ను ధరించరు లెండి.అది వారి స్వవిషయం.
అలాంటి వారిని పక్కన పెడితే అసలు అండర్‌వేర్స్ వల్ల మనకు ఏ విధమైన నష్టాలు కలుగుతాయో, ఎలాంటి అండర్‌వేర్‌ను ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1.మరీ చిన్నవిగా ఉన్న అండర్‌వేర్స్‌ను ధరించకూడదు.మరీ పెద్దగా ఉండే థాంగ్స్ వంటి అండర్‌వేర్స్‌ను, సింథటిక్, సిల్క్ క్లాత్‌తో తయారు చేసిన అండర్‌వేర్స్‌ను ధరించకూడదు.
ఇవన్నీ మనకు అపరిశుభ్రతను, అనారోగ్యాలను కలగజేస్తాయట.థాంగ్స్ వంటి అండర్‌వేర్‌తో ఈ-కోలి బాక్టీరియా సులభంగా వ్యాపించగలుగుతుందట.
దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది.కొన్ని సందర్భాల్లో యూరిన్ ఇన్‌ఫెక్షన్లు కూడా వస్తాయట.
2.శారీరక శ్రమ లేదా వ్యాయామం అనంతరం చెమట పట్టిన అండర్‌వేర్‌ను అలాగే ధరించకూడదు.దాని స్థానంలో పొడి అండర్‌వేర్‌ను ధరించాలి.లేదంటే ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి.
3.బాడీ షేప్ సరిగ్గా కనిపించడం కోసం కూడా పలు అండర్‌వేర్‌లు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి.అయితే వీటిని ధరించడం కూడా అంతమంచిది కాదట.ఎందుకంటే ఇవి బాగా టైట్‌గా ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశంలో చర్మం ఇర్రిటేషన్‌కు గురవుతుందట.ఇక మహిళలకైతే యోనిలో ఈస్ట్ ఇన్‌ఫెక్షన్లు వస్తాయట.కొంత మందిలో గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయట.
అధిక శాతం మందికి మూత్ర విసర్జన చేయడం కష్టంగా మారుతుందట.

4.స్త్రీలు రోజంతా అండర్‌వేర్‌ను తప్పనిసరిగా ధరించాలట.లేదంటే యోనిలో విడుదలయ్యే సహజసిద్ధమైన ద్రవాలకు రక్షణ ఉండదట.
5.నాణ్యమైన డిటర్జెంట్‌తోనే అండర్‌వేర్స్‌నుశుభ్రం చేసుకోవాలట.లేదంటే వాటిలో ఉన్న బాక్టీరియా, ఈస్ట్ వంటి క్రిములు అంత త్వరగా పోవట.
6.వంద శాతం పూర్తి కాటన్‌తో తయారు చేసిన అండర్‌వేర్స్‌నే ధరించాలట.నైలాన్, పాలిస్టర్ వంటి ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన అండర్ వేర్స్ అయితే ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుందట.