ఇండస్ట్రీలో నాగార్జునను అలా పిలుస్తారా.. కాదంబరి కిరణ్ ఏం చెప్పారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో కాదంబరి కిరణ్ కూడా ఒకరు.కాదంబరి కిరణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కుర్రాళ్ల రాజ్యం సినిమా తర్వాత నాగార్జున ఇంట్లో నాగార్జునకు కథ చెప్పానని ఆయన తెలిపారు.

 Kadambari Kiran Interesting Comments On Nagarjuna Goes Viral In Social Media Det-TeluguStop.com

నా కథ వినడానికి నాగార్జున రెండున్నర గంటల పాటు కూర్చున్నారంటే మిరాకిల్ అని ఆయన చెప్పుకొచ్చారు.నాగార్జున గారు నేను చెప్పిన కథలో రెండు సీన్లకు కరెక్షన్ చెప్పారని ఆయన తెలిపారు.

17 సంవత్సరాలు అయినా ఆ రెండు సీన్ల కరెక్షన్ ఆయన వినలేదని అది ఆయన తప్పు కాదని కాదంబరి కిరణ్ అన్నారు.ప్రతి కొత్త ఛానల్ లో నేను సీరియల్ ప్రొడ్యూస్ చేశానని ఆ సీరియళ్ల వల్ల నేను ఆర్థికంగా నష్టపోయానని ఆయన చెప్పుకొచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కటి నేను అబ్జర్వ్ చేశానని ఆయన తెలిపారు.ఇండస్ట్రీలో డార్లింగ్ అనే పదం పిలవడాన్ని కనిపెట్టింది నేనేనని ఆయన చెప్పుకొచ్చారు.నా నుంచి పూరీజగన్నాథ్ డార్లింగ్ అనే పదాన్ని బుజ్జిగాడు సినిమాలో పెడితే ప్రభాస్ ఆ పదాన్ని ఊతపదంగా మార్చుకున్నారని ఆయన తెలిపారు.

Telugu Kadambari Kiran, Chinnababu, Nagarjuna, Nagarjuna Sweet-Movie

నాగార్జున గారితో తెరకెక్కించాల్సిన బావ మూవీ ఎందుకు మధ్యలోనే ఆగిపోయిందనే ప్రశ్నకు కాదంబరి కిరణ్ నాగార్జున స్థాయి రోజురోజుకు పెరుగుతోందని నా హీరో ఏఎన్నార్ గారు చనిపోయారని అన్నారు.ఎన్నో ప్రాజెక్ట్ లు ఆగిపోయానని కాదంబరి కిరణ్ తెలిపారు.ఏఎన్నార్ గారితో రెండు సీరియల్స్ చేశానని కాదంబరి కిరణ్ అన్నారు.

నాగార్జునకు పల్లెటూరి టైటిల్స్ అంటే ఇష్టమని కాదంబరి కిరణ్ చెప్పుకొచ్చారు.

Telugu Kadambari Kiran, Chinnababu, Nagarjuna, Nagarjuna Sweet-Movie

నాగార్జునను ఇండస్ట్రీలో అందరూ చినబాబు అని పిలుస్తారని కాదంబరి కిరణ్ వెల్లడించారు.నేను భగవంతుడిని నమ్ముతానని కాదంబరి కిరణ్ అన్నారు.పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో కాదంబరి కిరణ్ కు మంచి పాత్రలు దక్కాయి.

కాదంబరి కిరణ్ వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube