శాంతి, సమానత్వం, ప్రేమ, దయ, జాలి, తోటి వ్యక్తిని భగవంతుని ప్రతిరూపంగా చూడటం ఇలా ప్రపంచంలోని అన్ని మతాల సారం ఒక్కటే.ఆనాదిగా ఎంతోమంది మహనీయులు మనుషుల మధ్య సోదర భావాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తూనే వున్నారు.
అలాగే ఏ పండుగ తీసుకున్నా కనిపించేది ఇదే.అయితే కొందరు మాత్రం ఈ సూక్ష్మాన్ని గ్రహించలేక ఉన్మాదిలా మారుతూ ప్రాణాలు సైతం తీసేస్తున్నారు.ఈ సంగతి పక్కనబెడుతే.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రసంగంలో భారతీయుల పర్వదినం హోలీ ప్రస్తావన తీసుకొచ్చారు.శుక్రవారం ఈస్టర్ వేడుకలను పురస్కరించుకుని వైట్‌హౌస్ నుంచి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.దేశ ప్రజలు వారం క్రితమే హోలీ పండుగ చేసుకున్నారని.
ఈరోజు ఈస్టర్ జరుపుకుంటున్నారని.ఇంకొన్ని రోజుల్లో రంజాన్ కూడా వస్తుందని బైడెన్ తన ప్రసంగంలో చెప్పారు.
తాను, తన భార్య జిల్ బైడెన్ ఈస్టర్ వేడుకల కోసం ఎదురుచూస్తున్నామని అధ్యక్షుడు పేర్కొన్నారు.ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాటంకంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవచ్చని బైడెన్ సూచించారు.
అయితే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలైన మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తూచా తప్పకుండా పాటించాలని అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు.ప్రజలు కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే మహమ్మారి మళ్లీ విజృంభించే అవకాశం ఉందని, నిపుణులు సైతం దీనిపై వార్నింగ్ ఇచ్చారని బైడెన్ గుర్తుచేశారు.
అందువల్ల ప్రతిఒక్కరూ కొవిడ్-19 నిబంధనలు పాటించాలని హితవు పలికారు.టీకా విషయంలో లేని పోని భయాలు విడనాడి.వ్యాక్సిన్ వేయించుకోవాలని జో బైడెన్ పిలుపునిచ్చారు.
కాగా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని గత సోమవారం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ట్విటర్ వేదికగా ప్రపంచ వ్యాప్తంగా వున్న భారతీయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సంతోషాల విందు.హోలీ అంటే సానుకూల దృక్పథం, మనుషుల మధ్య భేదాలను పక్కనపెట్టి అంతా కలిసి రావడం’’ అని కమల ట్వీట్ చేశారు.అటు డెమొక్రటిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు టామ్ సుయోజ్జి.కూడా భారతీయ అమెరికన్లకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.