కూకట్ పల్లి లో జనసేన కు కొత్త టెన్షన్ ! పోటీలో జాతీయ జనసేన 

తెలంగాణలో బిజెపితో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉంది.బిజెపితో పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాలను జనసేనకు కేటాయించారు.

 Janasena,bjp, Kookatpalli, Telangan Elections, Tdp, Brs Party, Telangana Electio-TeluguStop.com

అందులో ప్రధానంగా కూకట్ పల్లి నియోజకవర్గం సీటులో తప్పకుండా గెలుస్తామనే ధీమాతో ఉన్నారు.అయితే ఇప్పుడు మరో జనసేన పార్టీ నుంచి ముప్పు వచ్చేలా కనిపిస్తోంది.

కూకట్ పల్లి లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత జాతీయ జనసేన అనే పార్టీ జాబితాలో కనిపించింది.ఆ పార్టీ ఎన్నికల గుర్తుగా బకెట్ ఉంది.

జనసేన ఎన్నికల గుర్తును పోలి ఉండే విధంగా ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రత్యర్థులు జనసేన ఓట్లకు గండి కొట్టే విధంగా ఈ ప్లాన్ చేశారని జనసేన వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

కూకట్ పల్లిలో జనసేన అభ్యర్ధి ముమ్మడి ప్రేమ్ కుమార్ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ నియోజకవర్గంలో ఎక్కువ గా ఉత్తరాంధ్ర ప్రాంతం వారు ఉండడం తో , అది తమకు కలిసి వస్తుంది అని జనసేన అంచనా వేసుకుంటోంది.కానీ ఇప్పుడు జనసేన పేరును పోలి ఉండే విధంగా ఉన్న జాతీయ జనసేన పోటీలో ఉండడం తో , జనసేన టెన్షన్ పడుతోంది.

బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే జాతీయ జనసేన పార్టీని ఏర్పాటు చేయించింది అని , అందుకే జనసేన గుర్తు ను పోలి ఉన్న బకెట్ గుర్తు తో ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారని మండిపడుతున్నారు.

Telugu Brs, Janasena, Kcr Telangana, Kookatpalli, Telangan, Telangana-Politics

ఇప్పటికే కూకట్ పల్లిలో జనసేన బిజెపి కూటమికి అవకాశం లేకుండా చేసేందుకు బీ ఆర్ ఎస్ గట్టిగానే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా బిజెపినీ ఓడించడమే కాకుండా,  జనసేనకు ఏమాత్రం అవకాశం లేకుండా చేయాలని చూస్తోంది.దానిలో భాగంగానే జాతీయ జనసేన పార్టీని ఏర్పాటు చేయించి ఇటు తెలంగాణతో పాటు రాబోయే ఏపీ ఎన్నికల్లోను జనసేన ను దెబ్బ కొట్టే ప్రయత్నం రాజకీయ ప్రత్యర్ధులు మొదలు పెట్టారు అనే అనుమానాలు జనసేన వర్గాల్లో నెలకొన్నాయి.

ప్రస్తుతం కూకట్ పల్లి నియోజకవర్గం లో జాతీయ జనసేన పార్టీ చీల్చే ఓట్లు పైనే బీజేపీ , జనసేన లు లెక్కలు వేసుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube