ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది.మాజీ డీసీసీబీ ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
ఈ క్రమంలోనే జంగా రాఘవ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని తెలుస్తోంది.ఇందులో భాగంగా మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారని సమాచారం.
అయితే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన జంగా రాఘవ రెడ్డి కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడారని తెలుస్తోంది.







