ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు పోవడానికి ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.జగన్ పైనే మా నమ్మకం.
జగన్ పైనే మా భరోసా అంటూ వైకాపా( YSRCP ) శ్రేణులు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.మా నమ్మకం నువ్వే జగన్… జగనన్న మా భవిష్యత్తు( Maa Nammakam Nuvve Jagan ) ప్రచారంలో భాగంగా ఇంటింటిపై స్టిక్కర్స్ ని అతికిస్తున్నారు.
ఇప్పుడు ఇదే ఏపీ మొత్తం రచ్చ సాగుతోంది.ఇంటింటికి స్టిక్కర్స్ వేయించడంతో విపక్ష పార్టీలు ఆ స్టిక్కర్స్ పై జగనన్నకు టైం దగ్గర పడింది.
ఆయనపై మాకు నమ్మకం లేదు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వేసిన పోస్టర్స్ పై జనసేన పార్టీ నాయకులు మాకు నమ్మకం లేదు జగన్.
మాకు నమ్మకం పవన్( pawan kalyan ) అంటూ కొత్తగా స్టికర్స్ ని వేస్తున్నారు.
మొత్తానికి రకరకాలుగా జగన్ అన్నకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారంతో వైకాపాకు చిరాకు కలుగుతోంది.ఒకవైపు జగనన్న భరోసా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటే మరో వైపు జగనన్నను అవమానిస్తూ తక్కువ చేస్తూ అవతల పార్టీల వాళ్లు విమర్శలు చేస్తున్నారు.ఇవన్నీ చూస్తుంటే పరిస్థితి ముందు ముందు సీరియస్ గా మారే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది.
ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది.అయినా కూడా ఇప్పటికే హడావుడి మామూలుగా లేదు.
రచ్చ రచ్చగా రాజకీయం జరుగుతోంది.ఈ రచ్చ రాజకీయాల నేపథ్యంలో ఏపీ ప్రజలు ఎవరి వైపు ఉంటారో అనేది చూడాలి.జనసేన మరియు తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) కలిసి పోరాటం చేసే ఉద్దేశం తో ఉన్నట్లుగా తెలుస్తోంది.మరో వైపు బిజెపి కూడా అధికార వైకాపా కి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తోంది.
ఎన్నికల సమయానికి రాష్ట్రంలో రచ్చ రచ్చగా ఒక పార్టీ పై మరో పార్టీ విమర్శలు.ప్రతి విమర్శలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.