సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందం, అభినయం మాత్రమే సరిపోదు.అంతకు మించిన అణకువ, క్రమశిక్షణ కూడా ఎంతో ముఖ్యం.
అవి లేని రోజు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా పతనాన్ని చూడాల్సిందే.అలా పతనం చూసిన చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు.
వారిని చూసి కూడా భవిష్యత్తు తరాల వారు మారకపోతే ఇక ఎవరూ ఏమీ చేయలేరు.అన్నీ తెలిసిన కూడా తనను తాను మార్చుకోలేక చివరికి జీవితాన్ని కోల్పోయాడు హీరో హరినాథ్.
అప్పట్లో ఆరడుగుల ఎత్తు అంతకు మించిన అందమైన రూపం చూడగానే ఆజానుబాహుడిల కనిపించేవాడు. ఎన్టీఆర్, అక్కినేని తర్వాత అతడే స్టార్ హీరో అవుతాడని అందరూ భావించారు.
కానీ అతడు దూరం తనని పతనం వైపు నడిపించాయి.హరినాథ్( Haranath ) నీ మార్చుకోవడానికి ప్రయత్నించిన వాళ్లు చాలామంది ఉన్నారు.అందులో మొదటి వారు ఎన్టీఆర్.ఆయన దర్శకత్వంలో హరినాథ్ హీరోగా సీతారాముల కళ్యాణం( Seeta Rama Kalyanam ) అనే సినిమా వచ్చింది.చాలా పెద్ద విజయం సాధించింది మందుకు, సిగరెట్లకి, మగువలకి దూరంగా ఉండాలని ఎన్టీఆర్ చాలా చెప్పి చూశారు.ఆయన ముందు సరే అంటారు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఫాలో అవ్వాలని కూడా ప్రయత్నిస్తారు.
కానీ మరి కొన్ని రోజులు తర్వాత హరినాథ్ వల్ల అయ్యేది కాదు.ఇక ఆయన్ని మార్చుకోవాలని చాలా ఎక్కువ ప్రయత్నించిన హీరోయిన్ జమున.
అక్కినేని, ఎన్టీఆర్ తో గొడవలతో కొంత కాలం పాటు జమున ను హీరోయిన్ గా బ్యాన్ చేసిన సమయంలో హరినాథ్ తో ఆవిడ ఏకంగా 30 సినిమాల్లో కలిసి నటించింది.ఆ సందర్భంలో ఎవరైనా హరినాధ్ తో కలిసి సినిమా తీస్తే అందులో ఫ్రీ గా నటించడానికి ఓకే అని కూడా కొంతమంది దర్శక నిర్మాతలతో చెప్పేది జమున.హరినాథ్ నీ తాగుడుకు దూరం చేయాలని చాలా రోజుల పాటు ప్రయత్నించారట ఆవిడ.జమున( Jamuna )కు హరినాథ్ పై చాలా ప్రత్యేకమైన అభిమానం ఉండేది.
చివరి వరకు ఎంత ప్రయత్నించినా కూడా ఆమె వల్ల కాకపోవడంతో ఆమె కూడా వదిలేశారు.అలా కెరియర్ లో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు అనుకున్న హరినాథ్ పూర్తిగా పతనమై సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు.