మాస్ రాజా సరసన అవకాశం దక్కించుకున్న మల్లు బ్యూటీ..!

హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తూనే ఉంటారు మళ్ళీ వెళ్తూనే ఉంటారు.ఒక్కొక్కరు మొదటి సినిమాతోనే హిట్ కొట్టి స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిపోతారు.

 Iswarya Menon Gets Chance In Ravi Teja Movie, Ravi Teja, Iswarya Menon, Social M-TeluguStop.com

అందం, అభినయం తో పాటు కొంచెం అదృష్టం కూడా ఉండాలని అంటూ ఉంటారు.అలాంటి అదృష్టం కొంతమందికి మాత్రమే ఉంటుంది.

కొంతమంది ఎంత టాలెంట్ ఉన్నా ఎందుకో సరైన హిట్ పడక స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోతారు.

అలాంటి వారిలో ఐశ్వర్య మీనన్ ఒకరు.

ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పది సంవత్సరాలు అవుతున్న ఆఫర్లు లేక ఇబ్బంది పడుతుంది.ఈ అమ్మడు సిద్దార్థ్ కు జంటగా లవ్ ఫెయిల్యూర్సినిమాతో తెలుగులో పరిచయం అయ్యింది.

ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు.అందుకే ఈ అమ్మడికి మళ్ళీ అవకాశాలు రాలేదు.

అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు అలరిస్తూ ఉంటుంది.ఈ మధ్య షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Telugu @ishmenon, Iswarya Menon, Iswaryamenon, Ravi Teja, Mediya-Movie

మళ్ళీ దాదాపు పది సంవత్సరాల తర్వాత రవితేజ సినిమాలో ఛాన్స్ అందుకుంది.ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తుంది.మాస్ మహారాజ రవితేజ ఈ మధ్యనే సరైన హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.ఆ జోరులోనే వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.

రవితేజ ఈ సినిమా తర్వాత తన 68వ సినిమాను త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయబోతున్నాడు.

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేర్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్నట్లు తెలిపారు.ఈ సినిమాను త్రినాథరావు హిల్లేరియస్ కామెడీ మూవీగా తెరకెక్కిస్తున్నాడట ఈ చిత్రంలో రవితేజ డిటెక్టీవ్ పాత్రలో కనిపించి సినిమా మొత్తం కడుపుబ్బా నవ్వించబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వస్తున్నా టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube