ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయబోతోందా...?

టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ రాజకీయ వ్యూహాలు తలలు పండిన రాజకీయ మేధావులకు కూడా ఒక పట్టాన అర్థం కావు.ఆయన ఏదైనా చేయాలి అనుకుంటే… దానిని పక్కగా అమ్మలు చేయడంలో మాత్రం ఎక్కడా … వెనకడుగు వేయడు.

 Is Trs Going To Participate In Ap Elections-TeluguStop.com

తెలంగాణలో అటువంటి వ్యూహంతోనే టిఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు వచ్చాడు.ఇక అక్కడ మరో ఐదేళ్ల వరకు తిరిగి చూసుకునే పని లేకపోవడంతో … ఇక జాతీయ రాజకీయాల వైపు దృష్టిపెట్టాడు.అందుకే… ఫెడరల్ ఫ్రంట్ పేరుతో… వివిధ రాష్ట్రాలు తిరుగుతూ… రాష్ట్రాల్లో వివిధ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఇదే సమయంలో… ఏపీ రాజకీయాలు దృష్టి కేంద్రీకరించాడు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయంతో ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపి అధికారంలోకి రాకుండా చేయాలని రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడు.

దీనిలో భాగంగానే టీడీపీ ప్రత్యర్థి పార్టీలు వైసిపి జనసేన పార్టీ ఆ పార్టీ అధినేత తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.టిడిపి ఏపీలో అధికారంలోకి రాకుండా చేయడానికి తగిన సహాయ సహకారాలు అందిస్తాను అంటూ … హామీ ఇస్తున్నాడు.అంతేకాకుండా టిడిపి ఓడించడానికి అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ఏపీలో టిఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులను కూడా రంగంలోకి దించి పొలిటికల్ వేడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు.

గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ ఇచ్చిన విందులో చోటు చేసుకున్న పరిణామాలు …అక్కడ ఏపీకి చెందిన కొంతమంది నాయకులతో కేసీఆర్ జరిపిన మంతనాలు బట్టి చూస్తే ఈ విషయం అర్ధం అవుతోంది.

ఏపీ రాజకీయాల్లో ….

వేలుపెడతాను అని కేసీఆర్ చెప్పడమే కాదు….అందుకు తగ్గట్టుగా రాజకీయ సమీకరణాలు మార్చుకుంటూ… వెళ్తున్నాడు.

ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామన్న కేటీఆర్.తెలంగాణలో టీడీపీ పోటీ చేయగా లేనిది.

తాము ఏపీలో ఎందుకు పోటీ చేయకూడదన్న వాదన వినిపిస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన ఏపీలోనూ పోటీ చేయాలన్న ఆలోచన కొస్తున్నట్లు తెలుస్తోంది.తెలుగుదేశం పార్టీకి ఒక్క ఓటు తగ్గే అవకాశం ఉన్నా.పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

దీనికి కుల లెక్కలు కూడా కేసీఆర్ వేస్తున్నాడు.ఏపీలో కులాల్ని చూసి ఓటు వేస్తారని కేటీఆర్ గట్టిగా నమ్ముతున్నారు.

అందుకే వెలమ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న చోట.టీఆర్ఎస్ అభ్యర్థుల్ని.నిలబెట్టి ఏపీలో రాజకీయం మలుపు తిప్పాలని చూస్తున్నట్టు టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకుల మధ్య చర్చలు నడుస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube