స్నేహం కోసం సినిమాలో కృష్ణ నటించకపోవడానికి అసలు కారణమిదే?

స్టార్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి.రీఎంట్రీలో కూడా వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలలో నటిస్తూ మెగాస్టార్ చిరంజీవి బిజీగా ఉన్నారు.

 Interesting Facts About Megastar Chiranjeevi Sneham Kosam Movie Details, Chiranj-TeluguStop.com

ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఉన్నన్ని సినిమాలు మరే హీరో చేతిలో లేవు.చిరంజీవి నటించిన సినిమాలలో స్నేహం కోసం సినిమా  కూడా ఒకటి కాగా ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

కె.ఎస్.రవికుమార్  డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 1999 సంవత్సరంలో విడుదలైంది.

ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులుగా చిరంజీవి, మీనా నటించారు.

తమిళంలో శరత్ కుమార్, సిమ్రాన్ కలిసి నటించిన ‘నట్పుక్కాగ’ సినిమాకు రీమేక్ గా తెలుగులో ఈ సినిమా స్నేహం కోసం పేరుతో తెరకెక్కింది.అయితే ఈ సినిమాలో విజయ్ కుమార్ నటించిన పాత్రలో కృష్ణ నటించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల కృష్ణ ఆ పాత్రలో నటించలేదు.

చిరంజీవి, కృష్ణ కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి.

కొత్త అల్లుడు, కొత్తపేట రౌడీ, తోడుదొంగలు సినిమాలలో చిరంజీవి, కృష్ణ కలిసి నటించారు.తోడు దొంగలు సినిమా తర్వాత చిరంజీవి, కృష్ణ కలిసి నటించలేదు.

Telugu Chiranjeevi, Rajasekhar, Krishna, Meena, Sharath Kumar, Simaran, Sneham K

ఖైదీ సినిమాతో చిరంజీవికి స్టార్ గా గుర్తింపు దక్కింది.‘నట్పుక్కాగ’ సినిమా బాగా నచ్చడంతో ఆ సినిమా రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపించారు.స్నేహం కోసం సినిమాలో కృష్ణ పేరు ఫైనలైజ్ కాకుండానే చిరంజీవి కృష్ణ కలిసి నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

హీరో కృష్ణకు ఈ విషయం తెలిసి ఆ సినిమాలో నటించడానికి తనకు ఆసక్తి లేదని చెప్పాలని భావించారు.ఆ పాత్ర ముసలి వ్యక్తి పాత్ర కావడంతో కృష్ణ ఆ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపలేదు.

ఆ తర్వాత ఈ సినిమాలోని ముసలివ్యక్తి పాత్ర కోసం హీరో రాజశేఖర్ పేరును పరిశీలించారు.అయితే ఆ పాత్రలో నటించవద్దని రాజశేఖర్ కు చిరంజీవి సూచించారు.ముసలి వ్యక్తి పాత్రలో నటిస్తే రాజశేఖర్ కెరీర్ కు మైనస్ అవుతుందని చిరంజీవి భావించారు.

Telugu Chiranjeevi, Rajasekhar, Krishna, Meena, Sharath Kumar, Simaran, Sneham K

ఆ తర్వాత విజయ్ కుమార్ ఈ సినిమాలో ఫైనల్ అయ్యారు.ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ కావడం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడం తెలిసిందే.చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్, గాడ్ ఫాదర్ సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఈ రెండు సినిమాలు 2022 సంవత్సరంలో రిలీజ్ కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube