కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ కొన్ని రోజులుగా రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే భోగి పండుగను పురస్కరించుకుని రైతులు వినూత్న రీతిలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ ఇళ్ల ఎదుట ముగ్గులు వేశారు.తమ వినతులు ప్రభుత్వానికి తెలిసే విధంగా రంగవళ్లులను తీర్చి దిద్దారు.
మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలి… అన్నదాత సుఖీభవ… మా భూముల్లో పరిశ్రమలు వేసి మీరేమో ఇళ్లల్లో పండుగ చేసుకోండి.ఇది మీకు న్యాయమేనా.? అంటూ ముగ్గుల రూపంలో రాసి తమ నిరసనను వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.