టీమిండియా కొంప ముంచుతున్న ఇంజురీలు.. వరల్డ్ కప్ చేజారినట్టే?

ఈ నెలలోనే ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది.ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్టును వీడుతున్నారు.

 Injuries That Are Sinking The Horn Of Team India World Cup Missed , Jasprit Bumr-TeluguStop.com

దీనికి కారణం వారికి గాయాల అవుతున్నాయి.రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్‌ బుమ్రా వంటి ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకోగా స్టాండ్‌ బై బౌలర్లలో ఒకరైన దీపక్‌ చాహర్‌ కూడా ఇప్పుడు గాయాల కారణంగా తప్పుకున్నాడు.

సౌతాఫ్రికాతో తొలి వన్డేలో ఆడాలని ఈ బౌలర్ ప్రాక్టీస్‌ చేస్తుండగా అతని చీలమండ బాగా గాయపడింది.దాంతో సౌతాఫ్రికా వన్డేకి పూర్తిగా దూరమయ్యాడు.

అలాగే టీ20 వరల్డ్ కప్‌కు కూడా అతను దూరం కావచ్చని తెలుస్తోంది.ఇదే జరిగితే టీమ్ఇండియాకి గడ్డుకాలం తప్పదు.

గత నెల ఆసియా కప్‌లో మోకాలి గాయంతో రవీంద్ర జడేజా కూడా ప్రపంచకప్‌కు దూరమైన తర్వాత టీమ్ ఇండియాకు ఇది రెండో గాయం దెబ్బ.ఇక ప్రపంచ కప్‌ సందర్భంగా టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌ కోసమని ముకేశ్‌ చౌదరి, చేతన్‌ సకారియా అనే ఇద్దరు ప్లేయర్స్‌ని నెట్‌ బౌలర్లుగా ఎంపిక చేశారు.

వీరు బౌలింగ్ మెషిన్స్‌ లాగా పనిచేస్తూ బ్యాటర్‌లు ప్రధాన టోర్నమెంట్‌కి సిద్ధం అయ్యేందుకు సహాయపడతారు.ఐపీఎల్‌లో చెన్నై తరఫున ఆడిన ముకేశ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడిన చేతన్‌ సకారియా పెర్త్‌లో ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లారు.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 23న టీమ్‌ఇండియా తన ఫస్ట్ మ్యాచ్‌ పాకిస్థాన్‌తో తలపడుతుంది.ఇప్పటి నుంచి ఆ సమయం వరకు టీమ్ ఇండియా ప్లేయర్లు ఆస్ట్రేలియాలోనే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడతారు.ఈ టైమ్‌లో జట్టు బ్రిస్బేన్‌కు కూడా వెళ్తుంది.అక్టోబర్ 17న ఆస్ట్రేలియాతో మన జట్టు వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతుంది.ఇదిలా ఉండగా గాయాలపై భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించారు.“గాయాలు కావడం దురదృష్టకరం.మనం చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది ఇదే సమయంలో ప్లేయర్స్ గాయపడుతున్నారు.కీలక ప్లేయర్ బుమ్రా కూడా గాయపడ్డాడు, కానీ అది మరొకరికి అవకాశం అవుతుంది” అని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube