జీవితం ఎప్పుడు ఎలా సాగుతుందో ఎవరూ ఊహించలేరు.మొదటి రోజుల్లో పెద్ద భవనాల్లో రాజులా బతికి చివరికి బికారిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఒకప్పుడు బాగా బతికిన ఒక ఎన్నారై మహిళ( NRI Woman ) రియల్ స్టోరీ వింటే మీరు కూడా ఆ మాటలకు అంగీకరించక తప్పదు.
వివరాల్లోకి వెళితే, దాదాపు 40 ఏళ్లుగా దుబాయ్‌లో ( Dubai ) ఉంటున్న భారతీయ మహిళ ప్రియా.
( Priya ) తన తండ్రి అనుకోని మరణం, ఆపై తల్లి అనారోగ్యం వల్ల సర్వస్వం కోల్పోయింది.ఇప్పుడు ఆమె కుక్కలతో కలిసి హోండా సిటీ కారులో బిక్కుబిక్కుమంటూ జీవిస్తోంది.
మొదట్లో ఆమె లాభదాయకమైన కుటుంబ వ్యాపారంతో లగ్జరీ లైఫ్ గడిపింది.కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఆమె తల్లి మరణించిన తర్వాత ప్రతిదీ దిగజారింది.
ప్రియా తండ్రి మరణించిన తర్వాత, ఆమె తల్లి అనారోగ్యం పాలైంది.తల్లిని కాపాడుకునేందుకు వైద్య చికిత్సలకు చాలా డబ్బు ఖర్చు చేసింది.అదే సమయంలో ఆర్థిక పరిస్థితిని మేనేజ్ చేయడానికి ప్రయత్నించింది, కానీ దురదృష్టవశాత్తూ, కుటుంబ వ్యాపారంలో భారీ నష్టాలు వచ్చాయి.కొంత కాలంలోనే పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు అయ్యారు.
మరోవైపు ఆమె తల్లి ఆరోగ్యం క్షీణించింది.కొద్ది రోజుల తరువాత తల్లి మరణించింది.
మరికొన్ని రోజుల తరువాత ప్రియ తన ఇంటితో సహా సర్వం కోల్పోయింది.
రాణిలా జీవించిన ఆమె ఆఖరికి బతుకుదెరువు కోసం హౌస్ కీపింగ్ పనులు చేయాల్సి వచ్చింది.ముందుగా చెప్పినట్లు ఆమె వీసా గడువు ముగియడంతోపాటు సుమారు రూ.26 లక్షల అప్పులు, జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది.చివరికి ఆమెకు ఒక్క హోండా సిటీ కారు మాత్రమే మిగిలింది.రెంట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్న ప్రియా చేసేది లేక కారులోనే నాలుగు సంవత్సరాలు జీవించింది.
ఆమె సహాయం కోసం ఎదురుచూస్తూ నాలుగు సంవత్సరాలు తన కారులోనే జీవించింది.అయితే, జస్బీర్ బస్సీ అనే బిజినెస్ వుమన్ సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా ప్రియ పరిస్థితి గురించి తెలుసుకున్నారు.బస్సీ దుబాయ్‌లోని కార్ ఫేర్ గ్రూప్‌కు ఎండీగా వ్యవహరిస్తున్నారు.ఆమె ప్రియా పరిస్థితి చూసి చలించిపోయారు.మిగిలిన అప్పులన్నీ తీర్చడానికి ఆర్థిక సహాయం చేశారు.అలానే తన కంపెనీలో ఉద్యోగం, ఒక కారు కూడా ఆఫర్ చేశారు.
ప్రియా జస్బీర్‌కు కృతజ్ఞతలు తెలిపి ఉద్యోగం చేయడానికి అంగీకరించింది, అయితే ఆమె కారును తీసుకోవడానికి ఇష్టపడలేదు.