కరోనా చికిత్స విషయంలో కీలకంగా మారిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్..!!

దేశంలో కరోనా ఉద్రిక్తత భయంకరంగా ఉన్న సంగతి తెలిసిందే.మూడు వారాల వ్యవధిలో ఒక్కసారిగా కేసులు పెరిగిపోవటం రోగులకు హాస్పిటల్స్ లో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడటం మాత్రమే కాక ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడింది.

 Indian Air Force Becomes Crucial In Corona Treatment Indian Air Force, Oxygen Cy-TeluguStop.com

కరోనా చికిత్స విషయంలో ఆక్సిజన్ కీలకం కావటంతో.చాలా రాష్ట్రాలలో ఆక్సిజన్ అందక రోగులు మృతి చెందే పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తున్న నేపథ్యంలోఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంటర్ అయింది. 

సకాలంలో హాస్పిటల్ కి ఆక్సిజన్ ట్యాంకర్లు చేరవేస్తున్నాయి.

దేశంలో ఆక్సిజన్ అవసరం ఉన్న నగరాలకు యుద్ధ విమానాలు ట్యాంకర్లు చేర్చడంలో ఇప్పుడు కీలకంగా మారాయి.ఈ విధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధవిమానాలు సేవలందిస్తూ తాజాగా ఢిల్లీలో 60 మంది కరోనా రోగులను కాపాడాయి.

అదే విధంగా తెలంగాణలో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ఒడిషా నుండి మంత్రి ఈటెల రాజేందర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులతో మంతనాలు జరిపి యుద్ధవిమానాల ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను రప్పించారు.దేశంలో చాలా వరకు కరోనా రోగులు ఆక్సిజన్ కొరత తో అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఈ విధంగా ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు వారి ప్రాణాలను కాపాడటం లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube