ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది.వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ ఈ వైరస్‌కు సరైనా వాక్సిన్ మాత్రం అందుబాటులోకి రాలేదు.
ఈ నేపథ్యంలో రోజురోజుకు వైరస్ తో సహజీవనం చేసేందుకు సిద్ధపడుతున్న ప్రజలు… కరోనా వైరస్ ని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే దానిపై దృష్టి పెడుతున్నారు.ఏం చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అనేదానిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.
అయితే ప్రతి ఇంట్లో చింతకాయ ఉసిరి కాయ మామిడి కాయ లాంటి ఊరగాయలు ఉంటాయి అనే విషయం తెలిసిందే.మామూలుగానే ఊరగాయ పేరెత్తగానే నోరూరిపోతుంది.అయితే ప్రస్తుతం కొత్త రకం ఊరగాయ ద్వారా నిరోధక శక్తి పెంపొందించుకునే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.పసుపు ఊరగాయ తో ఇమ్యూనిటీపవర్ ఎంతగానో పెరుగుతుందట.
పసుపులోని యాంటీఆక్సిడెంట్స్ శరీరానికి ఇమ్యూనిటీ పవర్ పెంచడంతోపాటు జీర్ణశక్తి మెరుగ్గా ఉండేందుకు కూడా తోడ్పడతాయట.అంతేకాకుండా ఊరగాయలో వాడే అల్లం నిమ్మకాయ మిరియాలు ఇలాంటి పదార్థాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచి కలిగించి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో దోహదపడతాయి.
అయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని అదేపనిగా ఊరగాయలు తినడం కూడా మంచిది కాదు అని అంటున్నారు నిపుణులు.కేవలం రోజుకు రెండుసార్లు మాత్రమే తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచిస్తున్నారు.