టీడీపీ అధినేత చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు కోర్టులో నిలబడవని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అని అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు.
సీఐడీ అధికారులు ముందుగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరులేదన్న విషయాన్ని కన్నా గుర్తు చేశారు.రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు పేరును చేర్చారన్న ఆయన ఇది ముమ్మాటికీ తప్పుడు కేసని వెల్లడించారు.
ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించి వేధించడం సీఎం జగన్ కు అలవాటని విమర్శించారు.వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.
అయితే దీనిపై ప్రజలే తగిన బుద్ది చెబుతారన్న కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.