అప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్.. ఇప్పుడు ఐఏఎస్.. ఈ యువతి సక్సెస్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

ప్రస్తుత కాలంలో కెరీర్ పరంగా సంచలనాలు సృష్టించాలని భావిస్తున్న చాలామందికి ఆర్థిక పరమైన ఇబ్బందులు సమస్యగా మారుతున్నాయి.ఒకప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేసిన మహిళ ఇప్పుడు ఐఏఎస్ గా పని చేస్తుండటం గమనార్హం.

 Ias Officer Ramya Success Story Details Here Goes Viral In Social Media , Tamil-TeluguStop.com

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన రమ్య( Ramya ) సివిల్స్ లో జాతీయ స్థాయిలో 46వ ర్యాంకు సాధించడం గమనార్హం.రమ్య ఐఏఎస్ కావడానికి ఎంతో కష్టపడ్డారు.

రమ్య పేద కుటుంబంలో జన్మించగా తల్లి ఎంతో కష్టపడి ఈమెను పెంచారు.చదువుకోవడం కోసం ఈమె ఎంతో కష్టపడ్డారు.కుటుంబ పరిస్థితుల వల్ల రమ్య చిన్న వయస్సులోనే ఉద్యోగం చేయాల్సి వచ్చింది.ఎంబీఏ చదివిన తర్వాత రమ్య ఒకవైపు ప్రైవేట్ జాబ్ చేస్తూనే మరోవైపు యూపీఎస్సీ సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు.

ఆ తర్వాత రమ్య డేటా ఎంట్రీ ఆపరేటర్ గా కెరీర్ ను మొదలుపెట్టారు.

Telugu Coimbatore, Ias Ramya Story, Ramya, Ramya Story, Tamil Nadu, Upsc Civils-

రమ్య ఆరో ప్రయత్నంలో సివిల్స్ లో అర్హత సాధించారు.2021 సంవత్సరంలో విడుదలైన ఫలితాలలో రమ్య జాతీయ స్థాయిలో 46వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.తన తల్లి సపోర్ట్ తోనే తాను సక్సెస్ అయ్యానని రమ్య చెబుతున్నారు.

ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యేవాళ్లకు సైతం రమ్య తనదైన శైలిలో సలహాలు ఇస్తుండటం గమనార్హం.

Telugu Coimbatore, Ias Ramya Story, Ramya, Ramya Story, Tamil Nadu, Upsc Civils-

పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్లు తమ పరిస్థితులను ఎప్పుడూ బలహీనతగా భావించవద్దని ఆమె అన్నారు.ఫెయిల్యూర్స్ అనేవి అనుభవ సాధనాలే తప్ప చివరి అవకాశాలు కావని ఆమె అన్నారు.రమ్య వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కష్టపడితే సక్సెస్ సాధించవచ్చని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని రమ్య ప్రూవ్ చేశారు.రమ్య ఐఏఎస్ కావాలని కలలు కంటున్న ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube