రామ్ చరణ్ విషయంలో తండ్రిగా ఎంతో గర్వపడుతున్నా: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం హనుమకొండలో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ హాజరు కావడంతో ఈ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

 I Am Very Proud Of Ram Charan As A Father Chiranjeevi ,ram Charan ,chiranjeevi,-TeluguStop.com

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి రామ్ చరణ్ ని ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ అంచలంచలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

Telugu Chiranjeevi, Hanumakonda, Ram Charan, Rangasthalam, Meet, Tollywood-Movie

ఈ సందర్భంగా చిరంజీవి రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ ను ఇలా చూస్తుంటే తండ్రిగా తనకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు.రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో చెవిటి వాడి పాత్రలో నటించారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో తన ప్రతి ఒక్క మూమెంట్ ను ఎంజాయ్ చేసినట్లు తెలిపారు.ఈ సినిమాలో రామ్ చరణ్ నటన ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్నారు.

ఈ సినిమాకి జాతీయ అవార్డు రాకపోవచ్చు కానీ, రామ్ చరణ్ నటన గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అది ఎన్నో జాతీయ అవార్డులతో సమానం అని తెలిపారు.

Telugu Chiranjeevi, Hanumakonda, Ram Charan, Rangasthalam, Meet, Tollywood-Movie

ఇక తాజాగా ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన చిత్రం RRR.ఈ సినిమాలో రాంచరణ్ తన నటన విశ్వరూపం చూపించారని, ఈ సినిమాలో ఎన్నో షేడ్స్ కనిపించాయని చిరు వెల్లడించారు.ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

అలాగే ఈ పాట ఆస్కార్ నామినేషన్ లో నిలవడం మరింత సంతోషంగా ఉందని తెలిపారు.ఇంతకన్నా ఒక తెలుగు వాడికి ఏం కావాలి ఈ సినిమాలో రామ్ చరణ్ నటించినందుకు చాలా గర్వంగా ఉందని, ఓ తండ్రిగా ఆ విషయంలో తాను ఎంతో గర్వపడుతున్నానని రామ్ చరణ్ గురించి చిరంజీవి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube