ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే జీవులు తక్కువగానే ఉన్నాయి.వీటిలో 1,000 సంవత్సరాల వరకు బ్రతికేవి చాలా తక్కువ.
అయితే జెయింట్ స్పాంజ్ అనే జీవి ఏకంగా 15,000 సంవత్సరాల వరకు జీవించగలదు.అంటే ఇది క్షీరదాలు, ఉభయచరాలు, సరీసృపాలు, ఇతర జాతులతో సహా ఇతర జంతువుల కంటే చాలా ఎక్కువ కాలం నివసిస్తుంది.
అనాక్సికాలిక్స్ జౌబిని అని కూడా పిలిచే ఈ జంతువు సముద్రం లోతులలో నివసిస్తుంది.జెయింట్ స్పాంజ్ అంటార్కిటిక్ నీటిలో నివసిస్తుంది, ఇది చాలా చల్లని నీటిలో ఉపరితలం నుంచి వేల అడుగుల దిగువన ఉంటుంది.

జెయింట్ స్పాంజ్‌లు సాధారణంగా జూలలో కనిపించవు.ఇది మనకు సాధారణంగా కనిపించే జంతువు అసలే కాదు.ఇవి కేవలం సముద్రగర్భంలో మాత్రమే పెరుగుతాయి.ఇవి పెరిగే ప్రక్రియ వేల సంవత్సరాలు పట్టవచ్చు.వీటికి చాలా తక్కువ ఆక్సిజన్ అవసరం.జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది కాబట్టి ఇవి తక్కువ శక్తితోనే జీవించగలుగుతాయి.
అవి ఇతర జంతువుల కంటే ఎక్కువ కాలం జీవించడానికి వాటి ఆహారం నెమ్మదిగా అరగడమేనని చెప్పొచ్చు.వాటి కణాలు చాలా అరుదుగా చచ్చిపోతాయి.
నిజానికి, జెయింట్ స్పాంజ్‌లు జీవితాన్ని స్లో మోషన్‌లో సాగిస్తాయి.వయసు పెరిగే కొద్దీ వాటి స్పాంజినెస్ పెరుగుతుందని.
ఆక్సిజన్‌ను ఎక్కువగా తీసుకుంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.ఏదేమైనా ఏకంగా 15 వేల సంవత్సరాలు జీవించగల జంతువు ఈ భూ ప్రపంచంలో ఉండటం చాలా ఆశ్చర్యకరం.
దీని గురించి తెలుసుకున్న చాలా మంది వావ్ అని ఆశ్చర్యపోతున్నారు.







