ఈ ఆహారాలను తీసుకుంటే చెడు కొలస్ట్రాల్ మాయం అయ్యిపోతుంది

లో డెన్సిటీ లిపోప్రోటీన్ (ఎల్‌డీఎల్‌) చెడు కొలస్ట్రాల్ అని అంటారు.ఇది మన శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే చాలా ప్రమాదం.

 How To Reduce Bad Cholesterol Details,  Low Density Lipoprotein, Cholestrol, Vit-TeluguStop.com

ఈ చెడు కొలస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు వస్తాయి.అందువల్ల వైద్యులు చెడు కొలస్ట్రాల్ తగ్గించుకొని మంచి కొలస్ట్రాల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్ పెంచుకోవాలని సూచిస్తారు.అందుకే ఇప్పుడు చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ ని పెంచే ఆహారాల గురించి తెలుసుకుందాం.

యాపిల్

ప్రతి రోజు ఒక యాపిల్ తింటే చెడు కొలస్ట్రాల్ తొలగిపోతుంది.యాపిల్ లో ఉండే పోషక ప‌దార్థాలు లివ‌ర్ త‌యారు చేసే చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి.కొవ్వును క‌రిగిస్తాయి.

బీన్స్

బీన్స్ లో పీచు పదార్ధం ఎక్కువగా ఉండుట వలన చెడు కొలస్ట్రాల్ పెరగకుండా సహాయపడుతుంది.అలాగే శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది.

ద్రాక్ష

ద్రాక్షలో సైనిన్స్, టానిన్స్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో చెడు కొలస్ట్రాల్ ని కరిగిస్తాయి.అంతేకాక ద్రాక్ష లోని పొటాషియం శరీరంలోని విష పదార్థాలను బ‌య‌ట‌కు పంపుతుంది.

Telugu Apple, Bad Cholesterol, Beans, Cholestrol, Cholesterol, Grapes, Guava, Be

జామ పండు

జామ పండులో విట‌మిన్ సి, పాస్ఫ‌ర‌స్‌, నికోటిన్ యాసిడ్‌, ఫైబ‌ర్‌లు సమృద్ధిగా ఉండుట వలన కొలస్ట్రాల్ ని తగ్గించటమే కాక రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పుట్ట గొడుగులు

పుట్ట‌గొడుగుల్లో విట‌మిన్ బి, సి, కాల్షియం, ఇత‌ర మిన‌రల్స్ ఉంటాయి.ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube