రామాయణంలో ఎన్ని కాండాలు ఉంటాయి? అందులో ఏముంటుంది?

వాల్మీకి రచించిన రామాయణ మహా కావ్యంలో మొత్తం 24 వేలు శ్లోకాలు ఉన్నాయి.మొత్తం ఏడు కాండలు ఉన్నాయి.

 How Many Kandas In Valmiki Ramayana Details, Ramayana Maha Kavyam, Ramudu, Sita-TeluguStop.com

ఇందులో ఆరింటిని వాల్కీకి రచించాడని… ఏడోవదానిని మాత్రం ఆయన రచించలేదని చెప్తారు.ఏది ఏమైనప్పటికీ ప్రజలకు మంచి జ్ఞానాన్ని అందజేసే ఈ రామాయణ మహా కావ్యంలోని ఏడు కాండలు ఏమిటి, వాటిలోని ఒక్కో కాండంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటిది బాల కాండం. రామాయణ కథ ప్రారంభం, రాముని జననం, బాల్యం, విశ్వామిత్రునితో ప్రయాణం, యాగ పరిరక్షణ, సీతా స్వయంవరం, సీతారామ కల్యాణం గురించి ఉంటుంది.

రెండోది అయోధ్య కాండం.ఇందులో కైకేయి కోరిక, దశరథుని దుఃఖం, సీతా రామ లక్ష్మణుల వనవాస వ్రతారంభం గురించి వివరించబడింది.మాడోది అరణ్య కాండం. ఇందులో సీతారామ లక్ష్మణుల వనవాస కాలం, మునిజన సందర్శనం, రాక్షస సంహారం, శూర్పణఖ భంగం, సీతాపహరణం గురించి ఉంటుంది.

నాలుగోది కిష్కింధ కాడం.ఇందులో రాముని దుఃఖం, హనుమంతుడు రాముడినికి, సుగ్రీవుడికి స్నేహం కల్పించుట, వాలి వధ, సీతాన్వేషనణ ఆరంభం గురించి ఉంటుంది.

ఐదోది సుందర కాండం.

ఇందులో హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణం, లంకాదహనం, సీత జాడ గురించి రామునిడి తెలియజెప్పుట గురించి వివరించబడింది.ఆరోది యుద్ధ కాండం.ఇందులో సాగరానికి వారధిని నిర్మించుట, యుద్ధం, రావణ సంహారం, సీత అగ్ని ప్రవేశం, అయోధ్యకు రాక, పట్టాభిషేకం గురించి ఉంటుంది.

ఏడోది ఉత్తర కాండం.ఇందులో సీత అడవులకు పంపబడుట, లవ కుశుల వృత్తాంతం, సీత భూమిలో కలిసిపోవట, రామావతార సమాప్తి గురించి ఉంటుంది.

How Many Kandas In Valmiki Ramayana Details, Ramayana Maha Kavyam, Ramudu, Sita Devi, Anjaneyudu, Vaalmiki, Kandas In Ramayanam, Ravanaura, Ramayanam Kandas - Telugu Anjaneya Swamy, Anjaneyudu, Devotional, Ramayanamaha, Ramayanam, Ramudu, Ravanaura, Sita Devi, Sri Ramudu, Vaalmiki

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube