షేర్ చాట్ ఎలా ప్రారంభమయ్యింది? సంస్థ ఆదాయ, వ్యయాలు ఎంతంటే...

8 సంవత్సరాల క్రితం ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు కలిసి సోషల్ నెట్‌వర్కింగ్ షేర్‌చాట్ యాప్‌ను ప్రారంభించారు.ఇది వినియోగదారులు తమ స్వంత కంటెంట్‌ను సృష్టించుకోవడంతో పాటు స్వయంగా డైరెక్ట్ చేసేందుకు అవకాశం కల్పించే యాప్.ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి 3 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ అయ్యింది.2015లో ముగ్గురు కలిసి ప్రారంభించిన ఈ కంపెనీలో నేడు 20 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు.షేర్ చాట్ యాప్ ఎలా ప్రారంభమైందో, అది విజయ శిఖరానికి ఎలా చేరిందో ఇప్పుడు తెలుసుకుందాం.

 How Did Sharechat Start Details, Share Chat, Share Chat App, Fareed Ehsan, Moz A-TeluguStop.com

ముగ్గురు యువకుల సారధ్యంలో

ఒక ఇంటర్వ్యూలో షేర్‌చాట్ సహ వ్యవస్థాపకుడు ఫరీద్ ఎహ్సాన్ మాట్లాడుతూ ఐఐటి కాన్పూర్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, తన స్నేహితులతో కలిసి స్టార్టప్ ప్రారంభించాలని యోచించినట్లు చెప్పారు.ఒకరికొకరు తెలియకుండా చాట్ చేసుకునే ప్లాట్‌ఫారమ్ భారతదేశంలో లేదని ఈ సమయంలో అతను గ్రహించాడు.దీనిని రూపొందించిన్పుడు దాని పేరు ఓపెనియో. ఈ ప్లాట్‌ఫారమ్‌కు షేర్‌చాట్ అనే పేరు 2015లో వచ్చింది.

Telugu Fareed Ehsan, Influencer, Moz App, Share Chat App, Sharechat, App, Virtua

ప్రారంభం నుంచే మంచి స్పందన

షేర్‌చాట్‌ని ప్రారంభించిన తర్వాతే దానికి అత్యధిక యూజర్లు లభించారు.ఇది ప్రారంభమైన సమయంలో దేశంలో దాదాపు 25 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు.అందులో షేర్‌చాట్‌లో కేవలం 1 నుండి 2 కోట్ల మంది మాత్రమే చేరారు.

వారు వారి సొంత భాష మాత్రమే వాడేవారు.దీనిని గ్రహించిన షేర్ చాట్ నిర్వాహకులు యాప్‌ను దేశంలోని దాదాపు 15 భాషలలో అందుబాటులో ఉంచారు.ఆ తర్వాత లెక్కకుమించి యూజర్లు పెరిగారు.

షేర్ చాట్ తర్వాత మోజ్ ప్రారంభం

2020లో టిక్ టాక్ నిషేధించిన తర్వాత, వారు మోజ్ అనే యాప్‌ను ప్రారంభించారు.టిక్ టాక్ వంటి చిన్న వీడియోలు దీనిలో అందుబాటులోకి వచ్చాయి.ఫరీద్ ఈ యాప్‌ను తీసుకురావడం వెనుక ఉన్న కారణాన్ని చెప్పాడు.వినియోగదారులు చిన్న పట్టణం లేదా పెద్ద నగరానికి చెందినవారు కాబట్టి ఈ యాప్‌కి మోజ్ అని పేరు పెట్టారు.

Telugu Fareed Ehsan, Influencer, Moz App, Share Chat App, Sharechat, App, Virtua

ఇలా ఆదాయాన్ని పొందవచ్చు

షేర్‌చాట్ ప్రకటనల ద్వారా అధిక ఆదాయాన్ని పొందుతుంది.ఇంతేకాకుండా తాము వర్చువల్ గిఫ్టింగ్, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతామని నిర్వాహకులు తెలిపారు.

షేర్‌చాట్ ఆర్థిక పరిస్థితి

ఒక నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో షేర్‌చాట్ ప్రకటనల ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 30 శాతం మేరకు పెరిగింది.గతేడాది కంపెనీ వ్యయం రూ.3,407.5 కోట్లు. నాన్-ఆపరేటింగ్ ఖర్చుల కారణంగా షేర్ చాట్ నష్టం రూ.2498.6 కోట్ల నుంచి రూ.2,988.6 కోట్లకు పెరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube